Tollywood: ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టు.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్..
ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. కానీ ఒకప్పుడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టు. ఎన్నో చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు యాక్టర్. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది.

సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ చాలా కాలంపాటు కొనసాగడమంటే అంత సులభం కాదు. ఒకవేళ ఎక్కువ కాలం అగ్ర కథానాయికగా దూసుకుపోవాలంటే గ్లామర్ షో తప్పుకుండా అనే అపోహా ఉండేది. కానీ ఆ భావనను పూర్తిగా తొలగించేసింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే పద్దతిగా కనిపిస్తూ.. అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. దక్షిణాదిలో ఆమె తోపు హీరోయిన్. మలయాళీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. కానీ నార్త్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆమె అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. ఇప్పుడు ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టు.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్. తన సింప్లిసిటీతో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా స్థానం సంపాదించింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సాయి పల్లవి.
సాయి పల్లవి 9 మే 1992న జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరికి చెందిన ఆమె.. అవిలా కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించారు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే చాలా ఇష్టమున్న సాయి పల్లవి.. టీవీల్లో ప్రోగ్రామ్స్, సినిమాలు చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. 2009లో ETVలో ప్రభుదేవా డ్యాన్స్ రియాలిటీ షో ‘ఉంగలిల్ యార్ అదుత’ , ఢీ షోలలో పాల్గొంది. ఇందులో పైనలిస్ట్ అయ్యింది. 2005లో విడుదలైన ‘పల్లవి కస్తూరి మాన్’ , ధూమ్ ధామ్ చిత్రాలలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది.
ఆ తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి.. ప్రేమమ్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు రామాయణ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం రామాయణ సినిమాకు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం సాయి పల్లవి ఆస్తులు రూ.50 కోట్లు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..







