- Telugu News Photo Gallery Cinema photos Aamir Khan and Lokesh Kanagaraj Big Action Movie to Revive Bollywood Star's Career
Aamir Khan: అమీర్ ఖాన్‌ను ఆదుకునేది అతనొక్కడే.
అమీర్ ఖాన్‌కు పునర్వైభవం వస్తుందా..? మళ్లీ ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తాయా..? ఒకప్పట్లా మళ్లీ కింగ్ ఆఫ్ బాక్సాఫీస్‌గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తన సత్తా చూపిస్తారా..? ఇవన్నీ జరగాలంటే ఆ ఒక్కడే అమీర్ కోసం రావాలి. ఇప్పుడదే జరుగుతుంది.. పైగా ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రాబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏంటా కాంబో..?
Updated on: Jul 15, 2025 | 10:05 PM

ఒకప్పుడు అమీర్ ఖాన్ సినిమా అంటే బాక్సాఫీస్‌కు పండగే.. ఆయన వస్తే రికార్డుల షేపులు మారిపోయేవి. రెండేళ్లకో సినిమా చేసినా.. పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా చేసేవారు అమీర్.

ఓ టైమ్‌లో గజినీ, 3 ఇడియట్స్, పీకే, ధూమ్ 3, దంగల్ అంటూ ప్రతీ సినిమాతో రికార్డులు క్రియేట్ చేసారు అమీర్. దంగల్ తర్వాత అమీర్ ఖాన్ కెరీర్ బాగా స్లో అయిపోయింది.

ఓ టైమ్‌లో గజినీ, 3 ఇడియట్స్, పీకే, ధూమ్ 3, దంగల్ అంటూ ప్రతీ సినిమాతో రికార్డులు క్రియేట్ చేసారు అమీర్. దంగల్ తర్వాత అమీర్ ఖాన్ కెరీర్ బాగా స్లో అయిపోయింది.

మొన్నొచ్చిన సితారే జమీన్ పర్‌తో పర్లేదనిపించిన అమీర్.. కూలీలో స్పెషల్ క్యారెక్టర్‌తో త్వరలోనే పలకరించబోతున్నారు. అమీర్‌కు పునర్వైభవం రావాలంటే ఓ మాస్ సినిమా పడాలి.. ఆ భాద్యత లోకేష్ కనకరాజ్ తీసుకుంటున్నారు.

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా రాబోతుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు లోకేష్. ఈ సినిమాకు నిర్మాత కూడా అమీర్ ఖానే. కచ్చితంగా లోకేష్ కనకరాజ్ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తానంటున్నారు ఈ సీనియర్ హీరో.




