- Telugu News Photo Gallery Cinema photos Hari Hara Veera Mallu: Release Date, Pre Release Event Details and Censorship Update
Hari Hara Veeramallu: స్పీడు పెంచిన వీరమల్లు టీమ్.. ప్రీ రిలీజ్ వేడుకకు వేదిక ఫిక్స్
హరి హర వీరమల్లు టీమ్ స్పీడు పెంచింది. రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో వరుస అప్‌డేట్స్ ఇస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి వీరమల్లు టీమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ వీరమల్లు ప్రీ రిలీజ్ ఎక్కడ జరగబోతోంది. హరి హర వీరమల్లు రిలీజ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అందుకే ప్రమోషన్ స్పీడు పెంచింది మూవీ టీమ్.
Updated on: Jul 15, 2025 | 10:01 PM

హరి హర వీరమల్లు రిలీజ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అందుకే ప్రమోషన్ స్పీడు పెంచింది మూవీ టీమ్. ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ బజ్ పీక్స్‌లో ఉంది. దీనికి తోడు వరుస అప్‌డేట్స్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ పెంచుతున్నాయి.

తాజాగా వీరమల్లు క్రేజ్‌ను మరింత పెంచే న్యూస్ రివీల్ అయ్యింది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది హరి హర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యూ బై ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.

అవుట్‌పుట్ విషయంలో సెన్సార్ రిపోర్ట్ సూపర్బ్‌గా ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరో వైపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తోంది మూవీ టీమ్.

వైజాగ్ సముద్ర తీరంలో భారీ జనసందోహం మధ్య జూలై 20న ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు.

సౌత్‌లో హరి హర వీరమల్లు బజ్ సూపర్బ్ అనిపించేలా ఉన్నా... ఉత్తరాదిలో మాత్రం అంత సందడి కనిపించట్లేదు. అందుకే మేకర్స్ నార్త్ ప్రమోషన్స్ మీద ఇంకాస్త కాన్సన్‌ట్రేట్ చేస్తే బాగుటుంది అంటున్నారు అభిమానులు. మరి ఈ పది రోజులు యూనిట్ ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి.




