Nivetha Thomas: వారెవ్వా.. లుక్ అదిరిపోయింది.. బాడీ షేమింగ్ కామెంట్స్ సైలెంట్‌గా కౌంటర్ ఇచ్చిన నివేదా..
సాధారణంగా హీరోయిన్స్ లుక్స్, ఫిట్నెస్ విషయంలో చిన్న మార్పులు వచ్చినా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు. సినీతారలు కాస్త బరువు పెరిగితే వారి శరీరాకృతిపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తుంటారు. అయితే కొందరు తమ గురించి వచ్చే కామెంట్స్ పై రియాక్ట్ అవుతుండగా.. మరికొందరు మాత్రం మౌనంగానే ఉండిపోతారు. కానీ హీరోయిన్ నివేదా థామస్ మాత్రం సైలెంట్ గా కౌంటరిచ్చింది.

నివేధా థామస్.. దక్షిణాది సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసింది. అయితే ఈ బ్యూటీకి మంచి ఇమేజ్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. అయితే ఇటీవలే 35 చిన్న కథ అనే సినిమాలో తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్ గా కనిపించిన నివేదా.. తల్లి పాత్రలో నటించి మార్కులు కొట్టేసింది. ఇందులో తన పాత్రకు గానూ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ అందుకుంది. ఈ అవార్డ్ వేడుకలలో నివేదా లుక్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి : మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్‌లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..
ఆమె చాలా బరువు పెరిగిందని.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ? అంటూ నెట్టింట విపరీతంగా ట్రోల్స్ చేశారు. చీరకట్టులో ఆమె బొద్దుగా ఉండడంతో నెట్టింట డిస్కషన్ జరిగింది. అయితే తన గురించి వస్తున్న కామెంట్స్ పై నివేదా రియాక్ట్ కాలేదు. కాన రెండు నెలల్లోనే ఊహించని లుక్ లోకి మారిపోయి షాకిచ్చింది. రెండు నెలల్లోనే బరువు తగ్గి పూర్తిగా సన్నబడి కనిపించింది. ప్రస్తుతం నివేదా న్యూలుక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. కేవలం రెండు నెలల్లోనే ఇంత మార్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..
నివేదా థామస్.. కళ్లతోనూ హావభావాలు పలికించగల నటి. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన నిన్ను కోరి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా 35 చిన్న కథ కాదు అనే చిత్రంలో నటించి మెప్పించింది. ఇప్పుడు బరువు తగ్గి సన్నగా మారిన ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : గ్లామర్‌లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..








