Kushboo : ఏంటీ.. ఈ ఇద్దరూ ఖుష్బూ కూతుర్లా.. ? అందం ముందు హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో ఖుష్భూ ఒకరు. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు యంగ్ హీరోలకు తల్లిగా, వదినగా, అక్కగా నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

80, 90లలో దక్షిణాది సినిమా ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. అప్పట్లో ఆమె అందానికి యూత్ ఏకంగా గుడి కట్టారు. కొన్నాళ్లపాటు సినిమా ప్రపంచాన్ని ఏలిన ఖుష్భూ ఇప్పుడు మాత్రం సహాయ నటిగా రాణిస్తుంది. యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. ఓవైపు సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం కొత్త సీరియల్ చేస్తుంది. అంతేకాదు.. ఇటీవలే బరువు తగ్గి అభిమానులకు షాకిచ్చింది. ఇన్నాళ్లు బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు బరువు తగ్గి చాలా స్లిమ్ గా మారిపోయింది.
ఇవి కూడా చదవండి : మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఖుష్బూ నిత్యం తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇటీవల గణేష్ చతుర్థి సందర్భంగా ఇంట్లో జరిగిన వినాయక పూజా ఫోటోస్ షేర్ చేసింది. అందులో తన కుటుబంంతో కలిసి తీసుకున్న ఫోటోలను ఇన్ స్టాలో పంచుకుంది. అందులో ఖుష్బూ కూతుర్లు చాలా సన్నగా మారిపోయి ఎంతో అందంగా కనిపిస్తున్నారు. దీంతో ఖుష్బూ కూతుర్లను చూసి జనాలను ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..
ఇక ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక విదేశాల్లో చదువుకుంటుంది. ఆమె త్వరలోనే సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన శిక్షణ సైతం తీసుకుంటుంది. ఇక చిన్న కూతురు డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. ప్రస్తుతం ఖుష్బూ కూతుర్ల ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : గ్లామర్లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..








