AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టేజ్ పై హీరోయిన్‏ను ఇబ్బంది పెట్టిన హీరో.. పదే పదే నడుమును తాకుతూ.. వీడియో వైరల్..

సాధారణంగా పబ్లిక్‏లో ఉన్నప్పుడు పద్దతిగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చకు దారితీస్తుంటాయి. తారలు నలుగురిలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా, హుందాగా ప్రవర్తించాలి. కానీ కొన్నిసార్లు స్టార్స్ బిహేవియర్ విమర్శలకు దారితీస్తుంటుంది.

స్టేజ్ పై హీరోయిన్‏ను ఇబ్బంది పెట్టిన హీరో.. పదే పదే నడుమును తాకుతూ..  వీడియో వైరల్..
Pawan Singh
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2025 | 3:06 PM

Share

సాధారణంగా సినీతారలు పబ్లిక్ ముందు ఎంతో హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. సెలబ్రెటీల మాటలు, ప్రవర్తన, నడవడికను ప్రజలు ప్రతిక్షణం గమనిస్తుంటారు. ఇక తారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరలవుతుంటుంది. నలుగురి ముందుకు వచ్చినప్పుడు కొందరు స్టార్స్ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇదివరకు చాలా మంది తారలు స్టేజ్ పై , నలుగురి ముందు మాట్లాడే మాటలు, ప్రవర్తన విమర్శలకు దారితీస్తుంటుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరో ప్రవర్తన పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. స్టేజ్ పై తన పక్కన మాట్లాడుతున్న హీరోయిన్ నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. హీరోయిన్ ఇబ్బంది పడుతూ పక్కకు జరుగుతున్నప్పటికీ హీరో తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

ఇవి కూడా చదవండి

భోజ్ పురి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో పవన్ సింగ్. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన పవన్ సింగ్.. ఆ సమయంలో తన పక్కనే నిలబడి మాట్లాడుతున్న నటి అంజలి నడుమును పదే పదే తాకూతూ చిత్రంగా ప్రవర్తించాడు. ఆమె అసౌకర్యానికి గురవుతున్నా అందరూ చూస్తుండడంతో నవ్వుతూ కవర్ చేసింది. అయినప్పటికీ హీరో మాత్రం పదే పదే తాకూతూ ఆమెను ఇబ్బంది గురిచేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా సదరు హీరో తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

అయితే ఈ వీడియోపై పవన్ సింగ్ రియాక్ట్ కాలేదు. సాధారణంగా స్టేజ్ పై, ఈవెంట్లలో హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు రావడం సహజం. సెట్స్ , ఈవెంట్లలో తమకు ఎదురైన పరిస్థితులను కొందరు తారలు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగా.. మరికొందరు మాత్రం మౌనంగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..