- Telugu News Photo Gallery Cinema photos Do You Remember This Child Artist Shravya, Now She Is Famous Heroine In Telugu
Child Artist : ఈ చైల్డ్ ఆర్టిస్టు గుర్తుందా.. ? తెలుగులో క్రేజీ హీరోయిన్.. సక్సెస్ కోసం ఎదురుచూపులు..
తెలుగులో బాలనటీనటులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించి ఇప్పుడు వెండితెరపై గ్లామర్ పాత్రలతో రచ్చ చేస్తున్నారు అల్లు అర్జున్ సినిమాలో నటించిన ఈ చైల్డ్ మీకు గుర్తుందా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.
Updated on: Aug 27, 2025 | 7:27 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు గుర్తుందా..? తెలుగులో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. జగపతి బాబు సందడే సందడి, అల్లు అర్జున్, ఉదయ్ కిరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది.

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత చదువుల కోసం నటనకు బ్రేక్ ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మడు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది.

కొన్నాళ్లకు తెలుగులో కథానాయికగా తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో కథానాయికగా నటించి.. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. లవ్ యూ బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఫస్ట్ మూవీతోనే గ్లామర్ పరంగా ఆకట్టుకున్న ఈ అమ్మడుకు అంతగా సక్సెస్ మాత్రం రాలేదు. లవ్ యూ బంగారం తర్వాత కాయ్ రాజా కాయ్, నందిని నర్సింగ్ హోం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

తమిళంలో పగిరి విలాయెట్టు సినిమాలో నటించింది. 2017 తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.




