Venu Swamy: మళ్లీ వేణు స్వామినే నమ్ముకున్న టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్.. ప్రత్యేక పూజలు అందుకేనా? వీడియో వైరల్
అందం, అభినయం ఉన్నా అదృష్టం లేని హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే విడుదల విషయంలో తరచూ ఏవో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సొగసరి మళ్లీ వేణు స్వామినే ఆశ్రయించింది.

సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఆ మధ్యన కొన్ని వివాదాల్లో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరిగినా మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై తన అభిప్రాయాలను చెబుతున్నారు. భారత్- పాకిస్తాన్ యుద్ధం, అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటిని తాను ముందుగానే ఊహించినట్లు ఇటీవల వీడియోలు రిలీజ్ చేశారు వేణు స్వామి. మరొక వైపు సినిమా తారలు మళ్లీ వేణు స్వామి ఇంటికి క్యూ కడుతున్నారు. వివిధ కారణాలతో అతనితో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. గతంలో రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, డింపుల్ హయతి తదితర స్టార్ హీరోయిన్లు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అలాగే అషు రెడ్డి, ఇనాయా సుల్తానా, నిశ్విక నాయుడు తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా నిధి అగర్వాల్ మరోసారి వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇదుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిధి అగర్వాల్ వేణు స్వామితో కనిపించడం ఇదేమీ మొదటి సారి కాదు. సుమారు రెండేళ్ల క్రితం కూడా వేణుస్వామితో పూజలు చేయించిందీ అందాల తార. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు బాగానే సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరముల సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోది. అయితే ఈ రెండు సినిమాలు షూటింగులు పూర్తి చేసుకున్నా విడుదల విషయంలో మాత్రం తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయతే హరి హర వీరమల్లు ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తన సినిమా సూపర్ హిట్ కావాలని నిధి వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
వేణు స్వామితో హీరోయిన్ నిధి అగర్వాల్.. వీడియో ఇదిగో..
View this post on Instagram
హరి హర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..