Nayanthara: ఆ ప్రముఖ ఆలయంలో నయనతార సాష్టాంగ నమస్కారాలు.. విడాకుల రూమర్లకు చెక్ పెట్టేసిన లేడీ సూపర్ స్టార్
లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె భర్త విఘ్నేష్ తో విడాకులు తీసుకుంటోందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా తన భర్త, పిల్లలతో కలిసి ఓ ప్రముఖ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది.

గతంలో కంటే సినిమాలు తగ్గినా నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోనూ హవా కొనసాగిస్తోందీ అందాల తార. అయితే ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ గురించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన భర్త విగ్నేష్ శివన్ కు హీరోయిన్ నయనతార విడాకులు ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి గురించి నయన్ పెట్టిన ఒక పోస్ట్ ఈ రూమర్లకు కారణమైంది. దీంతో నయన్ విడాకుల వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకు నయనతార చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగులు, పిల్లల పెంపకంతో బిజీగా ఉంటోన్న నయన్ తాజాగా పళని మురుగన్ (సుబ్రహ్మణ్యేశ్వరుడి ) స్వామి ఆలయానికి వెళ్లింది. తన భర్త, పిల్లలతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు, సాష్టాంగ నమస్కారాలు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోల్లో నయనతార, విఘ్నేష్ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. దీంతో విడాకుల వార్తకు చెక్ పడినట్లు తెలుస్తోంది.
ఈ గుడి ప్రత్యేకత ఎంటంటే?
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న పళని స్వామి గుడికి తమిళ హీరోలు ఎక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరో ధనుష్ తరచూ ఈ ఆలయానికి వెళుతుంటాడు. అలాగే శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి, కార్తి వంటి స్టార్స్ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో,మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో పళని మురుగన్ స్వామి ఆలయం మూడోది. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే పంచామృత చాలా ప్రత్యేకం. ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ అలా శివుడు వరమిచ్చినట్లు అక్కడి భక్తులు చెబుతారు. సంతానప్రాప్తి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారని స్థల పురాణం చెబుతోంది.
పళని మురుగన్ స్వామి ఆలయంలో నయనతార దంపతులు..
Beautiful couple #WikkiNayan with their adorable munchkins seek divine blessings at Palani Temple✨📷 #Nayanthara #VigneshShivan pic.twitter.com/sIS5exzPAB
— Femme Focus (@SAIKRIS40918887) July 6, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ సినిమాలో నటిస్తోంది. మలయాళ దర్శకురాలు గీతా మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ మరో హీరోయిన్ గా నటిస్తోంది.
మెగా 157 సినిమాలో..
#Mega157 with the MegaStar @KChiruTweets Sankranthi 2026 🔥 pic.twitter.com/c15pw3lMLl
— Nayanthara✨ (@NayantharaU) May 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.