Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఏకంగా 25 డిజాస్టర్స్.. 5 చిత్రాలే హిట్లు.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..

ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్లుగా రాణించాలంటే అందం, అభినయంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాల్సిందే. అందుకే సినీరంగంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ సొంతం చేసుకొని తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోియన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

Tollywood : తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఏకంగా 25 డిజాస్టర్స్.. 5 చిత్రాలే హిట్లు.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..
Charmy
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2025 | 12:39 PM

Share

ఒకప్పుడు తెలుగు సినీరంగంలో ఆమె తోపు హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కానీ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయి. అప్పట్లో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ మంచి మార్కులు కొట్టేసింది. అయితే వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమైంది. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం నిర్మాణ రంగంలో నిర్మాతగా రాణిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నెట్టింట మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ అమ్మడు మరెవరో కాదండి.. హీరోయిన్ ఛార్మీ కౌర్. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. తెలుగులో మాస్, లక్ష్మీ, స్టైల్, మంత్ర, సుందరకాండ, జ్యోతిలక్ష్మీ ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడు ఖాతాలో కేవలం 5 హిట్స్ మాత్రమే పడ్డాయి.

Charmy. New

Charmy. New

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఛార్మీ.. ఇప్పుడు నిర్మాతగా మారి వరుస సినిమాలు నిర్మిస్తుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించింది. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరు కలిసి నిర్మిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవడం లేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా ఛార్మీ వ్యవహరిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..