Natural Star Nani : అరుదైన రికార్డు అందుకున్న నేచురల్ స్టార్ ‘నేను లోకల్’ సినిమా..
నేచురల్ స్టార్ నాని.. సోలో గా వచ్చి క్రేజీ హీరోగా మారి.. ఇప్పుడు టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అసిసెంట్ డైరెక్టర్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంట్..
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani).. సోలో గా వచ్చి క్రేజీ హీరోగా మారి.. ఇప్పుడు టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అసిసెంట్ డైరెక్టర్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంట్.. అష్ట చమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పక్కింటి కుర్రాడిగా కనిపించే నాని తన నటనతో చాలా మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. సినిమా కథ ఏదైనా.. తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా అవలీలగా పండిస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. అందుకు ఉందాహరణే ఇంద్రగంటి తెరకెక్కించిన వి సినిమా. ఇక ఇటీవల వరుస ఫ్లాప్ లతో సతమతం అయిన నాని.ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించటానికి సిద్దమవుతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా నాని నటించిన సినిమా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని నటించిన సినిమా నేను లోకల్. ఈ సినిమా నాని కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాని సరసన అందాల భామ కీర్తిసురేష్ నటించిన విషయం తెలిసిందే. థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. యూట్యూబ్ లోనూ దూసుకుపోయింది. ఇప్పటివరకు నేను లోకల్ సినిమా యూట్యూబ్ లో 100 మిలియన్ కు పైగా వ్యూస్ ను రాబట్టింది. నాని కెరియర్లో యూట్యూబ్ లో అరుదైన రికార్డు అందుకున్న సినిమాగా నేను లోకల్ నిలిచింది. ఇక నాని సినిమాల్లో అంటే సుందరానికి సినిమా తర్వాత దసరా అనే సినిమా చేస్తున్నాడు. విభిన్న కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :