Priyanka Chopra: పుట్టిన మూడు నెలల తర్వాత కూతురుకు నామకరణం చేసిన ప్రియాంక.. ఏం పేరు పెట్టిందంటే..

Priyanka- Nick Jonas: బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది.

Priyanka Chopra: పుట్టిన మూడు నెలల తర్వాత కూతురుకు నామకరణం చేసిన ప్రియాంక.. ఏం పేరు పెట్టిందంటే..
Priyanka Chopra
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Apr 22, 2022 | 9:40 AM

Priyanka- Nick Jonas: బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. వరుస సినిమాలు, వెబ్‌సిరీస్ లు చేస్తోంది. ఇదిలా ఉంటే 2018లో ప్రముఖ అమెరికన్‌ పాప్‌ సింగర్ నిక్‌జొనాస్‌ (Nick Jonas) తో కలిసి ప్రియాంక పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా ఈ ఏడాది జనవరిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. అయితే అప్పటి నుంచి బిడ్డ ఫొటోలు కానీ, పేరును కానీ బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారీ లవ్లీ కపుల్‌. తాజాగా తమ గారాల పట్టికి ‘మాల్తీ మేరీ చోప్రా జోనస్‌’ (Malti Marie Chopra Jonas) అని పేరు పెట్టారట. కాగా మాల్టీ అంటే సంస్కృతంలో సువాసన కలిగిన పువ్వు అని అర్థం. అంతేకాకుండా ప్రియాంక త‌ల్లి పేరు మ‌ధుమాలతి నుంచి మాలతి అని తీసుకున్నార‌ట‌. ఇక మేరీ అంటే నక్షత్రం అని అర్థం. అలాగే జోనస్‌ తల్లి పేరు కూడా కలుస్తుంది. ఇక చివరిగా తన పేరు, భర్త పేరు వచ్చేలా చోప్రా జోనస్‌ కూడా జోడించారట.

బర్త్‌ సర్టిఫికెట్‌లో..

ప్రియాంక దంపతులు ఇటీవలే తమ కూతురుకు ఇటీవలే బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారట. అందులో పాప పేరుపే మాలతి మేరీ చోప్రా జోనాస్ అని రాయించారట. ఆ సర్టిఫికెట్‌లో మాలతి, కాలిఫోర్నియాలోని శాండియాగోలో జనవరి 15న రాత్రి 8 గంటలకు పుట్టినట్లు ఉందట. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ది మ్యాట్రిక్స్:​ రిసరెక్షన్స్’​తో సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది ప్రియాంక. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. దీనిని అమెజాన్​ ప్రైమ్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

Also Read:Bandi Sanjay: లెక్కలు తెలియకుంటే తెలుసుకో.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

PM Modi Address Live Updates: గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్.. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం..

Volvo Cars: వాహనాల కొనుగోలుదారులపై బాదుడే.. బాదుడు.. ఈ కంపెనీ కార్ల ధరలు భారీగా పెంపు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!