Thaman : మహేష్ సినిమా మూడో పాట పై మరింత హైప్ పెంచిన తమన్.. చెవుల్లో బాంబులు బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటా..
ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు తమన్(S. Thaman ). వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్ .
ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు తమన్(S. Thaman ). వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్ . సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తమన్ అందిస్తున్న సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తమన్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ఒకటి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి రెండు పాటలను విడుదల చేశారు. మొదటిగా విడుదలైన కళావతి పాట యూట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాట 145 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అలాగే మరో పాట పెన్నీ పాట కూడా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయినా ఈ సాంగ్ 27 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. త్వరలోనే (23న )మూడో పాటను రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోనుందని తెలుస్తుంది. తమన్ బీజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్య బాలయ్య నటించిన అఖండ సినిమాకు తమన్ అందించిన బీజీ కి సౌండ్ బాక్స్ లు కూడా బద్దలైన విషయం తెలిసిందే.. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు కూడా అదే రేంజ్ లో బీజీ అందించినున్నారు తమన్. తాజాగా తమన్ సర్కారు వారి పాటకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో తమన్ షేర్ చేసిన వీడియో సర్కారు వారి పాట నుంచి రానున్న మూడవ సాంగ్ పై మరింతగా అంచనాలు పెరిగేలా చేసింది. ఈ పాటతో మీ చెవుల్లో బాంబులు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటూ ఈ వీడియో కింద రాసుకొచ్చారు తమన్. దాంతో ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు మహేష్ అభిమానులు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :