PM Modi Address Live Updates: గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్.. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం..
Guru Tegh Bahadur Jayanti: సిక్కూ మత గురువు గురు తేజ్ బహదూర్ 400 ప్రకాష్ పర్వ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
Guru Tegh Bahadur Jayanti: సిక్కూ మత గురువు గురు తేజ్ బహదూర్ 400 ప్రకాష్ పర్వ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఎర్రకోట వేదికగా.. ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా గురుతేజ్ బహదూర్ స్మారక నాణెం, తపాలా స్టాంపును కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. ఇక 400 మంది కళాకారులు ‘శబ్ధ్ కీర్తన’ను ప్రదర్శించనున్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ సమన్వయంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాగా, ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ, విదేశాల్లోని పలువురు ప్రముఖులు పాల్గొంటారు. గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ కార్యక్రమాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన వెయ్యి మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎర్రకోట కాంప్లెక్స్‌లో దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
LIVE NEWS & UPDATES
-
చెన్నైకు సామ్స్ మరో ఝలక్..
డేనియల్ సామ్స్ నాలుగో వికెట్ పడగొట్టాడు. నిలకడగా ఆడుతున్న రాయుడు (40)ను కూడా బోల్తా కొట్టించాడు. దీంతో ఆ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజులో జడేజా (3) ఉన్నాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 31 బంతుల్లో 54 పరుగులు అవసరం.
-
గురు తేజ్ బహదూర్ అనుచరులు ప్రతిచోటా ఉన్నారు..
గురు తేజ్ బహదూర్ త్యాగం భారతదేశంలోని అనేక తరాల వారి సంస్కృతి, గౌరవాన్ని కాపాడుకొంటూ జీవించడానికి ప్రేరేపించిందని ప్రధాని మోదీ అన్నారు. పెద్ద శక్తులు కనుమరుగయ్యాయని, పెద్ద తుఫానులు శాంతించాయని అన్నారు. కానీ, భారతదేశం మాత్రం ఇప్పటికీ అలా తన ప్రత్యేకతను చాటుతోందన్నారు. గురునానక్ దేవ్ దేశం మొత్తాన్ని ఒక దారంలో ఏకం చేశారు. గురు తేజ్ బహదూర్ అనుచరులు ప్రతిచోటా ఉన్నారు. పాట్నాలోని పాట్నా సాహిబ్, ఢిల్లీలోని రాకబ్‌గంజ్ సాహిబ్, మనకు ప్రతిచోటా గురువుల దీవెనలు, జ్ఞానం రూపంలో భారతదేశం విరాజిల్లుతుందన్నారు.
-
-
ఔరంగజేబు ముందు ధైర్యంగా నిలబడిన గురు తేజ్ బహదూర్..
ఎర్రకోటకు సమీపంలో గురు తేజ్ బహదూర్ త్యాగానికి చిహ్నంగా గురుద్వారా శిష్‌గంజ్ సాహిబ్ కూడా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పవిత్ర గురుద్వారా మన గొప్ప సంస్కృతిని రక్షించడానికి గురు తేజ్ బహదూర్ చేసిన త్యాగం ఎంత గొప్పదో మనకు గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఆ సమయంలో మన దేశంలో మత ఛాందసవాదం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మన భారతదేశం ముందు మతాన్ని వేదాంతంగా, శాస్త్రంగా, స్వీయ పరిశోధనగా భావించి, మతం పేరుతో హింసకు, దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో గురు తేజ్ బహదూర్ రూపంలో భారతదేశం తన గుర్తింపును కాపాడుకోవాలనే గొప్ప ఆశ కనిపించిందన్నారు. ఔరంగజేబు నిరంకుశ ఆలోచనల ముందు గురు తేజ్ బహదూర్ హింద్ ది చాదర్‌గా నిలిచారు.
-
చెన్నైకు మరో షాకిచ్చిన సామ్స్..
ముంబై బౌలర్ డేనియల్ సామ్స్ చెన్నైకు మరో షాకిచ్చాడు. ఆదిలో రెండు వికెట్లు తీసిన ఈ బౌలర్ శివమ్ దూబె(13) ను కూడా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 88 పరుగుల వద్ద 4 వికెట్ కోల్పోయింది. క్రీజులో రాయుడు (30), జడేజా (0) ఉన్నారు.
-
ఎర్రకోట ముఖ్యమైన కాలాలకు సాక్షి: ప్రధాని మోదీ
ఎర్రకోట అనేక కాలాలకు సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కోట గురు తేజ్ బహదూర్ బలిదానం కూడా చూసింది. దేశం కోసం మరణించిన వ్యక్తుల ధైర్యాన్ని కూడా పరీక్షించింది. ‘‘ఈ భారత భూమి ఒక దేశం మాత్రమే కాదు, ఇది మన గొప్ప వారసత్వం, గొప్ప సంప్రదాయం.. మన ఋషులు, గురువులు వందల వేల సంవత్సరాల తపస్సుతో నీరు పోశారు, దాని ఆలోచనలను సుసంపన్నం చేసారు.’’ అని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ.
-
-
ప్రకాష్ పర్వ్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
మన దేశం గురువుల ఆశయాలపై పూర్తి భక్తితో ముందు సాగుతున్నందుకు తాను సంతోషిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. తాను మొత్తం పదిమంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నానని అన్నారు. ప్రకాష్ పర్వ్ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
-
షాబాద్ కీర్తన వినడం ద్వారా నేను పొందిన శాంతిని చెప్పలేను: ప్రధాని మోదీ
షాబాద్ కీర్తన వినడం ద్వారా నేను పొందిన శాంతి మాటల్లో చెప్పడం కష్టం అని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు గురు తేజ్ బహదూర్ కు అంకితం చేసిన స్మారక తపాలా స్టాంపు, నాణేన్ని విడుదల చేసే అవకాశం తనకు లభించడం అదృష్టం అని పేర్కొన్నారు.
-
గురు తేజ్ బహదూర్ ప్రత్యేక నాణెం, తపాలా స్టాంపును విడుదల చేసిన ప్రధాని మోదీ..
శ్రీ గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ సందర్భంగా ప్రత్యేక నాణెం, తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఎర్రకోట వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన కీలక ప్రసంగం చేశారు.
-
ఎర్రకోటలో వైభవంగా గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ వేడుకలు..
శ్రీ గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోటలో వైభవంగా జరుగుతున్నాయి.
#WATCH | Prime Minister Narendra Modi at the 400th Parkash Purab celebrations of Sri Guru Teg Bahadur at Red Fort, Delhi. pic.twitter.com/EW4VtCIi0k
— ANI (@ANI) April 21, 2022
-
‘శబ్ద్ కీర్తన’లో పాల్గొన్న కళకారులు, పిల్లలు…
రెండు రోజుల కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ‘శబ్ద్ కీర్తన’లో కళాకారులు, పిల్లలు పాల్గొంటున్నారు. గురు తేజ్ బహదూర్ జీవితాన్ని వర్ణించే గ్రాండ్ లైట్ అండ్ సౌండ్ షో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో సిక్కుల సాంప్రదాయ యుద్ధ కళ ‘గట్కా’ కూడా నిర్వహించడం జరుగుతుంది.
-
గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ..
ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన శ్రీ గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
Prime Minister Narendra Modi attends the 400th Parkash Purab celebrations of Sri Guru Teg Bahadur at Red Fort, Delhi pic.twitter.com/3pGZpLAWZK
— ANI (@ANI) April 21, 2022
-
ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు..
సిక్కు గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు.
Published On - Apr 21,2022 9:29 PM