Six Airbags For Cars: కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు.. ఆరోజు నుంచే అమలులోకి కొత్త నిబంధనలు !

దేశ వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది మంది ఈ ప్రమాదాల్లో అసువులు బాసుతున్నారు. ఈక్రమంలో వాహనదారుల భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రతిపాదనలు, నిబంధనలు తీసుకొస్తోంది.

Six Airbags For Cars: కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు.. ఆరోజు నుంచే అమలులోకి కొత్త నిబంధనలు !
Six Airbags For Cars
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Apr 22, 2022 | 9:35 AM

దేశ వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది మంది ఈ ప్రమాదాల్లో అసువులు బాసుతున్నారు. ఈక్రమంలో వాహనదారుల భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రతిపాదనలు, నిబంధనలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయని పేర్కొంది. కేవలం ఒక నెలలోనే దీనికి సంబంధించిన విధివిధానాలపై కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని చాలామంది భావించారు. అయితే ఈ నిర్ణయం వల్ల కార్ల ధరలు మరింత పెరుగుతాయని , దాని వల్ల కొనుగోలుదారులు దూరమయ్యే అవకాశం ఉందని తయారీ సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ప్రయాణికుల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు పెడుతున్నామన్న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) కార్లలో ఆరు బ్యాగ్‌ల అంశంపై స్పందించారు.

అందుకే ఆలస్యం..

ప్రమాద సమయాల్లో కార్లలో ఎయిర్‌బ్యాగులు ఉన్నట్లయితే కేవలం ఒక్క ఏడాదిలోనే 13 వేల మంది ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈక్రమంలో కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ల ఏర్పాటు అంశాన్ని రవాణా శాఖ నోటిఫై చేసిందన్న ఆయన.. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. మరోవైపు దీనికి సంబంధించిన విధివిధానాలకు తుది రూపు తెచ్చే పనిలో నిమగ్నమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే అన్ని కార్లలో 2 ఎయిర్‌బ్యాగ్‌ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరిగా ఉండగా.. మరో నాలుగు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఏర్పాటు వల్ల వినియోగదారుడికి అదనంగా 75 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు కాదని ప్రభుత్వం చెబుతోంది. అయితే కార్ల తయారీ సంస్థలు మాత్రం ఇందుకు 231 డాలర్ల అదనపు ఖర్చు అవుతుందని పేర్కొంటున్నాయి. అయితే తయారీ సంస్థల వాదనను తోసిపుచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘విదేశాలకు ఎగుమతి చేసే కార్లకు అదనపు ఎయిర్‌ బ్యాగ్‌లను అమర్చుతున్నప్పటికీ దేశీయంగా అమ్ముతున్న వాటిలో మాత్రం వాటిని ఏర్పాటు చేయడం లేదు’ అని మండిపడింది. నిజానికి తయారీ సంస్థలే ఎయిర్ బ్యాగ్‌లను అందించాల్సి ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడంతో ఈ కొత్త నిబంధనలు తీసుకురావాల్సి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Also Read: MI vs CSK IPL 2022: ధోని ధనా ధన్‌ ఇన్నింగ్స్‌.. థ్రిల్లింగ్‌ పోరులో చివరి బంతికి విజయం సాధించిన చెన్నై..

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..

Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. భారీ మెజార్టీ దిశగా..
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. భారీ మెజార్టీ దిశగా..
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
భమేళాకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారా..ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి
భమేళాకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారా..ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!