AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs CSK IPL 2022: ధోని ధనా ధన్‌ ఇన్నింగ్స్‌.. థ్రిల్లింగ్‌ పోరులో చివరి బంతికి విజయం సాధించిన చెన్నై..

MI vs CSK IPL Match Result: ఐపీఎల్‌ -2022లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబై లోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా గురువారం ముంబైతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో (MI vs CSK) లో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

MI vs CSK IPL 2022: ధోని ధనా ధన్‌ ఇన్నింగ్స్‌.. థ్రిల్లింగ్‌ పోరులో చివరి బంతికి విజయం సాధించిన చెన్నై..
Ms Dhoni
Basha Shek
|

Updated on: Apr 22, 2022 | 4:25 AM

Share

MI vs CSK IPL Match Result: ఐపీఎల్‌ -2022లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబై లోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా గురువారం ముంబైతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో (MI vs CSK) లో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై విధించిన 156 పరుగుల టార్గెట్‌ను సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధోని ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (13 బంతుల్లో 28 3 ఫోర్లు, ఒక సిక్స్‌) తో ఫినిషర్‌ పాత్రనుమరోసారి సమర్థంగా పోషించాడు. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా ఉనాద్కత్‌ బౌలింగ్‌లో ఒక సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టి చెన్నైను విజయ తీరానికి చేర్చాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి ముంబైను కట్టడి చేసిన ముఖేష్ చౌదరి (19/3) కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

సామ్స్‌ బెదరగొట్టినా..

156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌లోకి దిగిన చెన్నై జట్టు మొదటి బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌ (0) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత వచ్చిన మిచెల్‌ శాంట్నర్‌ (11) కూడా త్వరగానే ఔటయ్యాడు. అయితే ఊతప్ప (30), రాయుడు (40) ధాటిగా ఆడడంతో విజయం వైపు సాగింది. అయితే వీరిద్దరు త్వరత్వరగా ఔటవ్వడం, శివమ్‌ దూబె (13), కెప్టెన్‌ రవీంద్ర జడేజా (3) నిరాశపర్చడంతో కష్టాల్లో కూరుకుపోయింది. డేనియల్‌ సామ్స్ (30/4)తో పాటు బుమ్రా, మెరిడెత్‌ చెన్నై ను బాగా కట్టడి చేశారు. అయితే డ్వేన్ ప్రిటోరియస్‌ (14 బంతుల్లో 22) ధాటిగా ఆడి చెన్నైను మళ్లీ పోటీలో నిలిపాడు. ఉనాద్కత్‌ అతడిని ఔట్‌ చేసినా ధోని ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి మ్యాచ్‌ను ముగించాడు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ముఖేష్‌ చౌదరి ధాటికి రోహిత్‌ (0), ఇషాన్‌ కిషాన్‌ (0) లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. డెవాల్డ్ బ్రేవిస్‌ (4) కూడా నిరాశపర్చాడు. అయితే సూర్యకుమార్‌ యాదవ్‌(32), తిలక్‌ వర్మ (51) రాణించడంతో కోలుకుంది. చివర్లో హృతిక్‌ షోకిన్‌ (25), పొలార్డ్‌ (15) కొన్ని మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

Also Read: PM Modi Address Live Updates: గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్.. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం..

Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!

Immunity Boost: రోగనిరోధక శక్తిని పెంచుకునే ఈ 4 విటమిన్లు గురించి మీకు తెలుసా..