IPL 2022: 12 బంతుల్లోనే ముంబై గాలి తీసిన రూ. 20 లక్షల చెన్నై బౌలర్.. ఎవరో తెలుసా?

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ రెండూ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లు కావడంతో అందరి చూపు వాటిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో ఇద్దరూ అత్యంత దారుణమైన స్థితిలో ఉండడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు..

IPL 2022: 12 బంతుల్లోనే ముంబై గాలి తీసిన రూ. 20 లక్షల చెన్నై బౌలర్.. ఎవరో తెలుసా?
Ipl 2022 Mukesh Choudhary
Follow us
Venkata Chari

|

Updated on: Apr 21, 2022 | 9:31 PM

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వర్సెస్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండూ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లు కావడంతో అందరి చూపు వాటిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో ఇద్దరూ అత్యంత దారుణమైన స్థితిలో ఉండడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. అయితే, ప్రస్తుతం ఈ రెండు జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. ముంబై పరిస్థితి దారుణంగా ఉంది. గురువారం రెండు జట్లు ఢీకొన్నప్పుడు, ఒక చెన్నై బౌలర్ ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు. అది కూడా మొదటి 12 బంతుల్లోనే విధ్వంసం నెలకొల్పాడు. చెన్నైకి చెందిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి(Mukesh Choudhary), ఈ సీజన్‌లో అరంగేట్రం చేసి, ముంబైపై తన నిప్పులు కరిపించే బంతులతో విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను ముఖేష్ అవుట్ చేశాడు. దీంతో రోహిత్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

ముఖేష్ ఇక్కడితో ఆగలేదు. అదే ఓవర్ ఐదో బంతికి, అతను బెస్ట్ అవుట్ స్వింగ్‌లో రూ.15.25 కోట్ల విలువైన ముంబై రెండో ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను బౌల్డ్ చేశాడు. ముఖేష్ వేసిన లాంగ్ బాల్‌ను ఫ్లిక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఇషాన్ స్వింగ్ తప్పి పిచ్‌పై పడిపోయాడు. స్టంప్‌లు కూడా పడిపోయాయి.

ఈ సీజన్‌లోనే, చెన్నై రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో ముఖేష్‌ను కొనుగోలు చేసింది. పేలవంగా ప్రారంభమైనప్పటికీ నమ్మకాన్ని అలాగే ఉంచుకుంది. దాని ఫలితాలను ఈ మ్యాచ్‌లో ముఖేష్ అందిస్తున్నాడు. ముంబైపై కేవలం 12 బంతుల్లో 3 వికెట్లు తీశాడు. రోహిత్, ఇషాన్ తర్వాత, ముఖేష్ తన రెండవ ఓవర్ చివరి బంతికి డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే అతను నాలుగో వికెట్‌ను కూడా పొందేవాడు. అయితే స్లిప్‌లో తిలక్ వర్మ క్యాచ్‌ను డ్వేన్ బ్రావో జారవిడిచాడు.

Also Read: MI vs CSK: రోహిత్ శర్మ ఖాతాలో చేరిన చెత్త రికార్డ్.. ఐపీఎల్‌లోనే తొలి వ్యక్తిగా నమోదు.. అదేంటంటే?

IPL 2022: ఐపీఎల్ 2022లో ఈ బౌలర్ల చెత్త రికార్డులు.. లిస్టు చూస్తే షాకవుతారంతే?