DC vs RR Prediction Playing XI IPL 2022: ఢిల్లీని ఢీకొట్టేందుకు సిద్ధమైన రాజస్థాన్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..

IPL 2022లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. జట్టుకు చెందిన ఇద్దరు కీలక విదేశీ ఆటగాళ్లు, మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్, అలాగే సహాయక సిబ్బందిలోని కొంతమంది సభ్యులు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.

DC vs RR Prediction Playing XI IPL 2022: ఢిల్లీని ఢీకొట్టేందుకు సిద్ధమైన రాజస్థాన్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..
Dc Vs Rr Prediction Playing Xi Ipl 2022
Follow us
Venkata Chari

|

Updated on: Apr 22, 2022 | 6:20 AM

IPL 2022లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. జట్టుకు చెందిన ఇద్దరు కీలక విదేశీ ఆటగాళ్లు, మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్, అలాగే సహాయక సిబ్బందిలోని కొంతమంది సభ్యులు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ సన్నాహాలను అడ్డుకుంది. అయితే ఈ పరిస్థితి తర్వాత రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టు వారి మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచిన విధానం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. ఇటువంటి పరిస్థితిలో, రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో జరిగే తదుపరి మ్యాచ్‌లో, జట్టు మరింత బలమైన ఉద్దేశ్యంతో వెళుతుంది. అయితే అంతా కేవలం ఉద్దేశాల వల్లనే జరుగుతుందా లేక ప్లేయింగ్ XI (DC vs RR Playing XI Prediction) లో కొన్ని మార్పులు ఉంటాయా? ఢిల్లీ బలం నేపథ్యంలో రాజస్థాన్ కొన్ని మార్పులు చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

ఏప్రిల్ 22 శుక్రవారం వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు ఢీకొన్నప్పుడు, రెండు బలమైన బౌలింగ్ దాడులు, కొంతమంది బలీయమైన బ్యాట్స్‌మెన్స్ ఒకరినొకరు ఎదుర్కొంటారు. ఫామ్ పరంగా రెండు జట్లూ ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ, తమ చివరి మ్యాచ్‌లలో రెండూ గెలిచాయి. ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లు పటిష్ట ప్రదర్శన కనబరిచారు. ఇటువంటి పరిస్థితిలో, పోటీలో ఏదైనా మార్పులపై పెద్దగా అవకాశాలు లేవు.

రాజస్థాన్‌లో రెండు మార్పులు?

సంజూ శాంసన్ సారథ్యంలోని ఈ జట్టు నిరంతరం మంచి క్రికెట్ ఆడుతోంది. ప్రతిసారీ ఫలితాలు జట్టుకు అనుకూలంగా లేకపోయినా, జట్టు తన ప్రదర్శనతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. జోస్ బట్లర్-సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్‌ల బలమైన బౌలింగ్ దాడి, బలమైన బ్యాటింగ్ కారణంగా జట్టు ప్రధానంగా ఫలితాలను సాధించగలిగింది. దీంతె పెద్దగా మార్పులు ఆశించడం లేదు.

అయితే, ఓపెనర్ దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్ వంటి యువ బ్యాట్స్‌మెన్ గురించి మాత్రం ప్రశ్నలు అలాగే ఉన్నాయి. వారు తమ పాత్రలలో పూర్తిగా రాణించలేకపోయారు. ఇటువంటి పరిస్థితిలో, ఇక్కడ మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే బహుశా జట్టు ఇద్దరికీ మరో అవకాశం ఇవ్వాలని, ఈ మ్యాచ్ ఫలితం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.

ఢిల్లీలో నో ఛేంజ్..

ఢిల్లీ విషయానికి వస్తే, ఈ జట్టు కొన్ని మ్యాచ్‌లలో ఓడిపోయి పునరాగమనం చేసి కేవలం 11 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ కరోనా బారిన పడటంతో జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బలమైన విదేశీ ఆటగాళ్లను మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు రాజస్థాన్‌పై కూడా అందుబాటులో ఉండరు. అయితే ఇది ఉన్నప్పటికీ, ఢిల్లీ బలంగా దిగివస్తుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఎటువంటి మార్పులు చేసేలా కనిపించదు.

ఢిల్లీ ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

రిషబ్ పంత్ (కెప్టెన్-కీపర్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్.

రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

సంజు శాంసన్ (కెప్టెన్-కీపర్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.

Also Read: IPL 2022: టాస్ గెలిస్తే బౌలింగే.. కానీ, ఆ జట్టు విషయంలో మాత్రం రివర్స్ రిజల్ట్.. ఆ టీం ఏదో తెలుసా?

IPL 2022: 17 ఫోర్లు, 2 సిక్సర్లు.. 5 గురి బౌలర్ల ఊచకోత.. 63 బంతుల్లో మ్యాచ్ ఖతం!