IPL 2022: ముంబై ప్లే ఆఫ్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం.. పాయింట్ల పట్టికలో ఇతర జట్ల పరిస్థితేంటంటే..

IPL 2022 Points Table: IPL 2022 సీజన్‌ ప్రారంభమై సుమారు నెల రోజులు గడిచాయి. ఇప్పటివరకు (ఏప్రిల్‌21)వరకు 33 మ్యాచ్‌లు ముగిశాయి. కానీ ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపుతెచ్చుకున్న ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)..

IPL 2022: ముంబై ప్లే ఆఫ్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం.. పాయింట్ల పట్టికలో ఇతర జట్ల పరిస్థితేంటంటే..
Mi Vs Csk
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Apr 22, 2022 | 9:29 AM

IPL 2022 Points Table: IPL 2022 సీజన్‌ ప్రారంభమై సుమారు నెల రోజులు గడిచాయి. ఇప్పటివరకు (ఏప్రిల్‌21)వరకు 33 మ్యాచ్‌లు ముగిశాయి. కానీ ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపుతెచ్చుకున్న ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) ఇప్పటివరకు ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌ (MI vs CSK)లో రోహిత్ సేన 3 వికెట్ల తేడాతో చెన్నై చేతిలో ఓటమిపాలైంది. తద్వారా ప్లే ఆఫ్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక రెండో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ మ్యాచ్‌ ఫలితంతో పాయింట్ల పట్టికలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ మ్యాచ్‌కు ముందు కూడా చివరి స్థానంలో ఉన్న ముంబై మరో ఓటమిని మూటగట్టుకుని అదే ప్లేస్‌లో నిలిచింది. చెన్నై కూడా ఇప్పటికీ తొమ్మిదో స్థానంలో ఉన్నా ఈ విజయంతో వారి ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరాయి.

టైటాన్స్‌దే టాప్ ప్లేస్‌..

ఇక మిగతా జట్ల విషయానికొస్తే.. గుజరాత్ టైటాన్స్‌ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) రెండో ప్లేసులో ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) మూడో స్థానంలో ఉండగా, కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) నాలుగో ప్లేస్‌లో ఉంది. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఐదో ప్లేస్‌లో ఉంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఏడో స్థానం, పంజాజ్‌ కింగ్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఎనిమిదో ప్లేసులో కొనసాగుతున్నాయి.

వారి వద్దే ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లు..

ఇక టోర్నీలో అత్యధిక పరుగులు చేసే వారికిచ్చే ఆరెంజ్‌ క్యాప్ రాజస్థాన్‌ ఆటగాడు జోస్ బట్లర్‌ ( 6 మ్యాచ్‌ల్లో 375 పరుగులు) వద్దనే ఉంది. అతనికి పోటీగా కేఎల్ రాహుల్‌ (7 మ్యాచ్‌ల్లో 265 రన్స్‌), డుప్లెసిస్‌ (7 మ్యాచ్‌ల్లో 250 పరుగులు) 2,3వ స్థానాల్లో ఉన్నారు. ఇక పర్పుల్‌ క్యాప్‌ విషయానికొస్తే.. రాజస్థాన్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ ( 6 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్‌ ప్లేస్‌ లో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు), హైదరాబాద్‌ బౌలర్‌ టి.నటరాజన్‌ (6 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు) 2,3 స్థానాల్లో కొనసాగుతున్నారు.

Also Read:Bandi Sanjay: లెక్కలు తెలియకుంటే తెలుసుకో.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

MI vs CSK IPL 2022: ధోని ధనా ధన్‌ ఇన్నింగ్స్‌.. థ్రిల్లింగ్‌ పోరులో చివరి బంతికి విజయం సాధించిన చెన్నై..

Diabetes Control: ఈ ఆకులు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!