- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 stats: most single runs most wide balls most sixes and most fours full list
IPL 2022: ఐపీఎల్ 2022లో ఈ బౌలర్ల చెత్త రికార్డులు.. లిస్టు చూస్తే షాకవుతారంతే?
ఐపీఎల్ 2022లో బౌలర్లు సత్తా చాటుతున్నారు. అయితే, కొందరు మాత్రం రాణిస్తున్నా.. వారి పేరు మీద కొన్ని చెత్త రికార్డులను చేర్చుకున్నారు.
Updated on: Apr 21, 2022 | 8:22 PM

లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 77 సింగిల్స్ ఇచ్చాడు. బిష్ణోయ్ తన బంతుల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు.

పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ రెండు పరుగులు ఇవ్వడంలో ముందంజలో ఉన్నాడు. రాహుల్ మొత్తం 19 సార్లు రెండు పరుగులు ఇచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ముఖేష్ చౌదరి ఇప్పటివరకు అత్యధిక సార్లు 3 పరుగులు ఇచ్చాడు. మూడు బంతుల్లో మూడు సార్లు ఇలా మూడు పరుగులు ఇచ్చాడు.

ఈ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ అత్యధిక ఫోర్ల బాధితుడిగా మారాడు. అతని బంతుల్లో 27 ఫోర్లు బాదేశారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ వనిందు హసరంగ సిక్సర్లు ఇవ్వడంతో ముందంజలో ఉన్నాడు. అతని బంతుల్లో 17 సిక్సర్లు బాదేశారు.

నో బాల్స్ వేయడంలో కేకేఆర్ ఆటగాడు ఉమేష్ యాదవ్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను 4 నో బాల్స్ వేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ డ్వేన్ బ్రావో, రాజస్థాన్ రాయల్స్ ప్రసిద్ధ్ కృష్ణ వైడ్ వైడ్ బాల్స్ విషయంలో నంబర్‌వన్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో ఇద్దరూ చెరో 14 వైడ్ బాల్స్ వేశారు.




