Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..
Railway News: దక్షిణ మద్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల రద్దైన రైళ్లను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు...
Railway News: దక్షిణ మద్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల రద్దైన రైళ్లను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. పూర్తి వివరాలు ఇవే..
* ట్రైన్ నెంబర్ 07671 (గతంలో 57426) గుంతకల్-కాచిగూడ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 06.00 గంటలకు బయలు దేరి అదే రోజు 15.40కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07670 (గతంలో 57425) కాచిగూడ – గుంతకల్ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 10.05 గంటలకు బయలు దేరి అదే రోజు 20.05కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07274 (గతంలో 57473) కాచిగూడ – బోధన్ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 16.00 గంటలకు బయలు దేరి అదే రోజు 22.25 గంటలకి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07275 (గతంలో 57474) బోధన్ – మహబూబ్ నగర్ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 05.20 గంటలకు బయలు దేరి అదే రోజు 13.45కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07587 (గతంలో 57456) మహబూబ్ నగర్ – కాచిగూడ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 14.10 గంటలకు బయలు దేరి అదే రోజు 16.30కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07588 (గతంలో 57486) మిర్జాపల్లి – కాచిగూడ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 05.50 గంటలకు బయలు దేరి అదే రోజు 08.30కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07583 (గతంలో 57447) కాచిగూడ – మహబూబ్‌నగర్ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 13.15 గంటలకు బయలు దేరి అదే రోజు 15.45కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07584 (గతంలో 57448) మహబూబ్‌నగర్ – మిర్జాపల్లి మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 16.10 గంటలకు బయలు దేరి అదే రోజు 22.20కి గమ్యానికి చేరుతుంది.
ఇంగ్లీష్ టీచర్ కు ఇదేం పాడు బుద్ది.. సారుగారు చేసిన పనికి చితక బాదిన జనం