PG Medical Seats Scam: మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ తమిళిసై సీరియస్.. రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశం..

మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందా(pg medical seats scam) వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ (telangana governor) తమిళిసై సౌందర్ రాజన్(tamilisai soundararajan) సీరియస్ అయ్యారు. అర్హులైన స్టేట్ ర్యాంక్ హోల్డర్లకు పీజీ..

PG Medical Seats Scam: మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ తమిళిసై సీరియస్.. రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశం..
Telangana Governor Tamilisa
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 21, 2022 | 7:51 PM

మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందా(pg medical seats scam) వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ (telangana governor) తమిళిసై సౌందర్ రాజన్(tamilisai soundararajan) సీరియస్ అయ్యారు. అర్హులైన స్టేట్ ర్యాంక్ హోల్డర్లకు పీజీ మెడికల్ సీటు నిరాకరించడానికి కారణమైన “మెడికల్ పీజీ సీట్లను అడ్డం పెట్టుకుని కుంభకోణం” వార్తలపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. రాష్ట్ర విద్యార్ధులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తాను స్వయంగా డాక్టర్‌నని.. సీట్ల బ్లాక్ దందాపై నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ అధికారులను కోరారు.

తెలంగాణ(Telangana)లో మరో బిగ్‌ మెడికల్‌ స్కామ్‌ బయటపడింది. మెడికల్‌ పీజీ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారు. ఈ స్కాం ఎలా చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అన్న దానిపై దర్యాప్తు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.

వరంగల్‌ కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో మెడికల్‌ పీజీ సీట్ల స్కాం వెలుగుచూసింది. పేద విద్యార్థులకు అందాల్సిన సీట్లను కొందరు యూనివర్సిటీ అధికారులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు కోట్ల రూపాయలకు అమ్మేస్తున్నాయి. టాలెంటెడ్‌ విద్యార్థులకు దక్కాల్సిన సీట్లు కోట్లు కుమ్మరించగల వారికి వెళ్లిపోతున్నాయి. మెడికల్‌ సీట్ల స్కాం పక్కా ప్లాన్‌తో జరుగుతున్నట్టు దాని మోడస్‌ ఆపరెండీ బట్టి తెలుస్తోంది. ముందు సీట్లను బ్లాక్‌ చేసి తర్వాత వాటిని అమ్మేసేందుకు స్కాం గ్యాంగ్‌ స్కెచ్‌ వేసినట్టు అనుమానిస్తున్నారు. ఇలాంటి నలభైకి పైగా అనుమానాస్పద దరఖాస్తులను గుర్తించారు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌ కుమార్‌.

వేరే రాష్ట్రాలకు చెందిన మెరిటోరియస్‌ ర్యాంకర్స్‌ ను అడ్డుపెట్టుకుని సీట్ల బ్లాకింగ్‌ జరుగుతోంది. అడ్మిషన్‌ ప్రాసెస్‌ దశల వారీగా జరుగుతుంటుంది. ఫస్ట్‌ ఫేజ్‌ అడ్మిషన్‌లో సీటు తీసుకుని వదలుకుని వెళ్లిపోతే మిగతా ఫేజ్‌లకు అనర్హులు అవుతారు. కానీ చివరి ఫేజ్‌ వరకు ఉండి ఎగ్జిట్‌ అవుతున్నారు.

ఇదిలావుంటే, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 20 ప్రైవేటు, 4 మైనారిటీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల పరిధిలో మొత్తం 2295 పీజీ సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా 1090, ఆల్ ఇండియా కోటా 512, మేనేజ్మెంట్ కోటా 693 కింద సీట్లు కేటాయించారు. అయితే 40కి పైగా సీట్లలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్. స్ట్రే వెకెన్సీ ఆప్షన్‌ ఆధారంగా యాజమాన్యాలు సీట్లు బ్లాక్ చేస్తున్నాయంటున్నారు. ఒక్కో సీటును 2 కోట్ల రూపాయలకు పైగా విక్రయించినట్లు యూనివర్సిటీకి సమాచారం అందింది. దీంతో పీజీ సీట్ల బ్లాక్ దందాపై వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. మెడికల్ సీట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

మెడికల్‌ సీట్ల స్కాం విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు దృష్టికి తీసుకెళ్లారు రిజిస్ట్రార్‌. మంత్రి ఆదేశాలపై వరంగల్‌ పోలీసు కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి అసలు దొంగలను పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాసుల కోసం కక్కుర్తిపడి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కాలేజీల అనుమతి రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు..

మెడికల్‌ పీజీ సీట్లకు… ముఖ్యంగా నాలుగైదు బ్రాంచ్‌ల సీట్లకు డిమాండ్‌ చాలా ఎక్కువ. వచ్చిన సీటును వదిలేసి వెళ్లిపోతే మొన్నటి వరకు 5 లక్షల ఫైన్‌ ఉండేది. దాన్ని 20 లక్షలకు పెంచారు. అయినా సీట్‌ బ్లాకింగ్‌కు వెనుకాడటం లేదంటే ఒక్కో సీటు ఏ రేంజ్‌లో రేటు పలుకుతోందో గెస్‌ చేయొచ్చు. రిజిస్ట్రార్ కంప్లయింట్‌తో ఈ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చేందుకు టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను రంగంలోకి దింపారు వరంగల్ సీపీ తరుణ్ జోషి.

ఇవి కూడా చదవండి: AP: ఫీజు కట్టాలంటూ అందరి ముందు అవమానించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు..

Rain: హైదరాబాద్‌లో ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షం.. నగరవాసులకు కాస్త ఉపశమనం..