AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు..

Hyderabad: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి రానుంది. తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్..

Hyderabad: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు..
Ts Govt
Narender Vaitla
|

Updated on: Apr 21, 2022 | 5:30 PM

Share

Hyderabad: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే క్రమంలో తెలంగాణ (Telangana)ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తేనుంది. తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆధ్వర్యంలో హైదరాబాద్ నలుదిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించాలని తలపెట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్‌లలో రూ. 2679 కోట్లతో ఆస్పత్రుల నిర్మాణం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పరిపాలనపరమైన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది.

ఎల్బీ నగర్‌లో రూ. 900 కోట్లు, సనత్‌ నగర్‌లో రూ. 882 కోట్లు, అల్వాల్‌లో రూ. 897 కోట్లతో ఆసుపత్రులను నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు జీవో ఎం. ఎస్ .41లో పేర్కొంది. ఇప్పటికే గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు.. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలోను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని ఆర్‌ అండ్‌ బీ శాఖను ఆదేశిస్తు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఎస్ ఐడీసీని, డీఎంఈలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ ఆసుపత్రులకు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఆ ఆసుపత్రులపై తగ్గనున్న ఒత్తిడి..

నగర శివార్లలో నలు దిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణం అయితే పెద్ద సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లపై ఒత్తిడి తగ్గనుంది. ఈ ఆసుపత్రుల నిర్మాణం వల్ల జిల్లాల నుంచి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించవచ్చు. అల్వాల్‌లో ఏర్పాటు చేసే ఆసుపత్రికి సిద్దిపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే రోగులు చక్కటి వైద్యం పొందే అవకాశం ఉంది. అలాగే ఎల్బీనగర్ ఆసుపత్రికి ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల నుంచి వచ్చే వారు వైద్యం పొందే వీలుంది. అంతేకాకుండా గచ్చిబౌలి, సనత్ నగర్ ఆసుపత్రులకు దగ్గరి జిల్లాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి.

గతంలో ఏదైనా అత్యవసర వైద్య సేవలు కావాలంటే నిమ్స్ లేదా, గాంధీకి వెళ్లాల్సి వచ్చేది. నగరంలో ఉండే ట్రాఫిక్‌ కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు మరణించిన సందర్భాలూ ఉన్నాయి. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే జిల్లాల నుంచి అత్యవసర వైద్య సాయం కావాల్సిన రోగులకు ట్రాఫిక్ బెడద లేకుండా నగర శివార్లలోనే అత్యుత్తమ, అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతోంది. దీంతో పాటు గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల ఒత్తిడి తగ్గుతుంది.

Ts Go

Also Read: RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?

TS Govt Jobs 2022: తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో పెట్టనున్న ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రాలు!

Viral: నిమ్మకాయల రేట్లు తగ్గాలని ‘తంత్ర పూజ’.. ఏం బలి ఇచ్చారో తెలిస్తే ఫ్యూజులు ఔట్