AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodanadu Case – VK Sasikala: కొడనాడు ఎస్టేట్ కేసులో శశికళను విచారించిన పోలీసులు.. చిన్నమ్మ రియాక్షన్ ఇదీ..!

Kodanadu Case - VK Sasikala: కొడనాడు ఎస్టేట్‌ మర్డర్ల కేసులో తమిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు వీకే శ‌శిక‌ళ‌ను చెన్నై పోలీసులు విచారించారు.

Kodanadu Case - VK Sasikala: కొడనాడు ఎస్టేట్ కేసులో శశికళను విచారించిన పోలీసులు.. చిన్నమ్మ రియాక్షన్ ఇదీ..!
Vk Sasikala
Shiva Prajapati
|

Updated on: Apr 21, 2022 | 5:41 PM

Share

Kodanadu Case – VK Sasikala: కొడనాడు ఎస్టేట్‌ మర్డర్ల కేసులో తమిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు వీకే శ‌శిక‌ళ‌ను చెన్నై పోలీసులు విచారించారు. 2017లో కొడ‌నాడు ఎస్టేట్ బంగ్లాలో జ‌రిగిన వ‌రుస హ‌త్యలు, దోపిడీల కేసుల్లో ఈ విచార‌ణ జ‌రిగింది. చెన్నైలోని టీ న‌గ‌ర్‌లో ఉన్న శ‌శిక‌ళ నివాసంలో ఈ విచార‌ణ సాగింది. వెస్ట్ జోన్ ఐజీ ఆర్ సుధాక‌ర్ నేతృత్వంలోని పోలీసుల బృందం విచారణ చేప‌ట్టింది. కొడ‌నాడు ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డ్‌ హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో, ఆ త‌ర్వాత బంగ్లాలో చోరీ జ‌రిగిన స‌మ‌యంలో శ‌శిక‌ళ బెంగుళూరులో జైలులో శిక్షను అనుభ‌విస్తున్నారు. అయితే అదే బంగ్లాలో మ‌రో న‌లుగురు అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో ఈ కేసులో మిస్టరీ మరింత పెరిగింది. గ‌తంలో జ‌య‌కు డ్రైవ‌ర్‌గా చేసిన క‌న‌క‌రాజ్ కారు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ రోజునే సాయ‌న్ అనే వ్యక్తి కూడా ప్రమాదానికి గుర‌య్యాడు. ఎస్టేట్‌లో ఉన్న కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు.

2017 ఏప్రిల్‌లో ఎస్టేట్ వాచ్‌మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. కొడనాడు ఎస్టేట్‌ వాచ్‌మెన్‌ను హత్య చేసింది కేరళ మనోజ్ గ్యాంగ్‌గా గుర్తించారు. మనోజ్‌ గ్యాంగ్‌ ఇచ్చిన సమాచారంతో శశికళను పోలీసులు విచారిస్తున్నారు. కొడనాడు ఎస్టేట్‌ మర్డర్‌, దోపిడీ కేసులో జయలలిత మాజీ డ్రైవర్‌ కనగరాజ్‌ను సూత్రధారిగా గుర్తించారు. అయితే ఆ తరువాత కనగరాజ్‌ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కొడనాడు ఎస్టేట్‌ నుంచి రూ. 200 కోట్లు లూటీ అయినట్టు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే 40 వేల విలువైన వాచ్‌లు మాత్రమే చోరీ అయినట్టు పోలీసులు తెలిపారు. నీలగిరి కొండల్లో జయలలిత కొడనాడు ఎస్టేట్ ఉంది. అత్యాధునిక సదుపాయాలతో కొడనాడులో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు జయలలిత. వెయ్యి ఎకరాల్లో టీ ఎస్టేట్.. మధ్యలో బంగళా.. ఉంది. కొడనాడు ఎస్టేట్‌లో మర్డర్‌పై డీఎంకే ప్రభుత్వం వచ్చాక విచారణ వేగవంతమయ్యింది. ఇప్పటి వరకు ఈ కేసులో 40 మందిని విచారించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం శశికళ బంధువు వివేక్ ని విచారించింది సిట్.

Also read:

Hyderabad: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు..

Jio,Vodafone Idea: జియో, వొడాఫోన్‌ ఐడియాలకు షాకిచ్చిన యూజర్లు.. దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌

Director Murugadoss: స్టార్ డైరెక్టర్‏కు అవకాశాల తిప్పలు.. ఎట్టకేలకు ఛాన్స్ ఇచ్చిన ఆ స్టార్ హీరో..