Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Murugadoss: స్టార్ డైరెక్టర్‏కు అవకాశాల తిప్పలు.. ఎట్టకేలకు ఛాన్స్ ఇచ్చిన ఆ స్టార్ హీరో..

ఒకప్పుడు హీరోల పాలిట కల్పతరువు అనే పేరుండేది డైరెక్టర్ మురుగదాస్‌కి. ఆయన సినిమా పడితే ఆ హీరోకి మహర్దశ పట్టినట్టే. కానీ...

Director Murugadoss: స్టార్ డైరెక్టర్‏కు అవకాశాల తిప్పలు.. ఎట్టకేలకు ఛాన్స్ ఇచ్చిన ఆ స్టార్ హీరో..
Director Murugadoss
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 21, 2022 | 5:26 PM

ఒకప్పుడు హీరోల పాలిట కల్పతరువు అనే పేరుండేది డైరెక్టర్ మురుగదాస్‌కి. ఆయన సినిమా పడితే ఆ హీరోకి మహర్దశ పట్టినట్టే. కానీ… కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు వెతికితే తప్ప కనిపించనంత అజ్ఞాతంలోకళ్లిపోయారు. బట్‌.. బౌన్స్‌ బ్యాక్ అవుతా చూడు… అంటూ ఫ్యాన్స్‌ని ఊరిస్తున్నారు మురుగుదాసుడు. ఇప్పుడాయన్ను ఆదుకునే ఆపద్బాంధవుడెవరై వుంటారు? మెగాస్టార్‌ రీఎంట్రీకి ముందు స్టాలిన్‌ లాంటి గొప్ప సినిమానిచ్చారు. తర్వాత రీఎంట్రీ సినిమా ఖైదీనంబర్‌ 150 ఒరిజినల్ కత్తి ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా చిరూ స్టామినాను నిలబెట్టేశారు. అందుకే మురుగదాస్ అంటే నాటోన్లీ కోలీవుడ్… టాలీవుడ్‌ ఆడియన్స్‌ క్కూడా స్పెషల్ కనెక్షన్ వుంది. కానీ… కొన్నాళ్లుగా తెర మరుగునే ఉండిపోక తప్పలేదీ క్రేజీ డైరెక్టర్‌కి. ఇప్పుడిప్పుడే ఓ ఖతర్నాక్ సబ్జెక్ట్‌తో రీస్టార్ట్ ఔతున్నారన్నది చెన్నై సర్కిల్స్‌లో వినిపిస్తున్న లేటెస్ట్‌ సమచారం.

హీరోకి పక్కా ఎలివేషన్ ఇస్తూ… అండర్‌కరెంట్‌గా పర్ఫెక్ట్ సోషల్ మెసేజ్ నడిపిస్తూ… ఒకప్పటి శంకర్ సినిమాల్ని తలపిస్తాయి మురుగదాస్ కథలు. కానీ.. రీసెంట్‌ టైమ్స్‌లో ఆ కంపోజిషన్‌ తిరగడ్డం మొదలైంది. మన సూపర్‌స్టార్‌తో చేసిన స్పైడర్‌ నుంచి… తమిళ్ సూపర్‌స్టార్‌తో చేసిన దర్బార్ దాకా రిసెంట్ సినిమాలన్నీ మురుగదాస్‌ కెరీర్‌ని ఇబ్బంది పెట్టినవే. .స్పైడర్‌తో డిప్రెస్ అయిన మహేష్‌బాబుకి మళ్లీ సూపర్‌హిట్టిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ఒట్టేసుకున్నా, ఆ ఛాన్స్ కూడా దక్కలేదు.  ఇప్పుడు చియాన్‌ విక్రమ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. బ్యాక్‌టుబ్యాక్ డిజాస్టర్స్‌తో భంగపడ్డ విక్రమ్‌కీ, గ్రాఫ్‌ని చక్కదిద్దుకోవాల్సిన మురుగదాస్‌కీ… ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం కాబోతోంది. సూర్యకు గజినీనిచ్చినట్టే… విక్రమ్‌కి కూడా మురుగదాస్‌ నుంచి మంచి గిఫ్ట్ రాబోతోందనే డ్రీమ్స్‌లో వుంది కోలీవుడ్.

Also Read:  Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..

RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?