Jio,Vodafone Idea: జియో, వొడాఫోన్‌ ఐడియాలకు షాకిచ్చిన యూజర్లు.. దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌

Jio,Vodafone Idea: రియలన్స్‌ జియోకు యూజర్లు షాకిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జియో భారీగా యూజర్లను కోల్పోయింది. జియోకు 36 లక్షల..

Jio,Vodafone Idea: జియో, వొడాఫోన్‌ ఐడియాలకు షాకిచ్చిన యూజర్లు.. దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌
Follow us
Subhash Goud

|

Updated on: Apr 21, 2022 | 5:32 PM

Jio,Vodafone Idea: రియలన్స్‌ జియోకు యూజర్లు షాకిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జియో భారీగా యూజర్లను కోల్పోయింది. జియోకు 36 లక్షల వరకు కస్టమర్ల సంఖ్య తగ్గిపోయింది. జియో (Jio)నే కాకుండా వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) కూడా భారీగా కస్టమర్లను కోల్పోయింది. ఈ కంపెనీ దాదాపు 15 లక్షల వరకు కస్టమర్లను కోల్పోయింది. టారిఫ్‌ ధరల పెంపే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జియో, వొడాఫోన్‌ ఐడియాలకు కస్టమర్ల సంఖ్య తగ్గడం ఇది మూడో నెల. ఇందుకు ఫిబ్రవరికి సంబంధించిన టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) వివరాలను వెల్లడించింది. దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ జియో సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 40.2 కోట్లుగా ఉంది.

అలాగే వొడాఫోన్‌ ఐడియా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 26.45 కోట్లుగా ఉంది. జనవరి నెలలో జియో 93 లక్షలు, వొడాఫోన్‌ ఐడియా 3 లక్షల చొప్పున కస్టమర్లు తగ్గిపోయారు. అయితే టెలికం కంపెనీలు నవంబర్‌ చివరి నాటికి ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో 20 శాతం సుంకాన్ని పెంచాయి. రెండో సిమ్‌ కార్డును రీచార్జ్‌ చేసుకోవడం తగ్గించారని టెలికం నిపుణులు చెబుతున్నారు.

ఇక డిసెంబర్‌లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగింది. జియో 1.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. ఇక ఎయిర్‌టెల్‌ మాత్రం దూసుకుపోయింది. ఫిబ్రవరి నెలలో 16 లక్షల మేర యూజర్లను పెంచుకున్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) నివేదికలో వెల్లడైంది. ఇక ఫిబ్రవరి చివరి నాటికి ఎయిర్‌టెల్‌ కస్టమర్ల సంఖ్య 35.8 కోట్లుగా ఉంది. ఇక నెలవారీ ప్రాతిపదికన చూస్తే మొత్తంగా దేశంలో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 37 లక్షల మేర తగ్గింది. 114.5 కోట్ల నుంచి 114.41 కోట్లకు క్షీణించింది. మార్చి నెలలో కూడా ఇదే తీరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Rythu Bima: రైతులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్.. పథకానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే..

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్‌ డబ్బుల విషయంలో కంపెనీ చుట్టు తిరుగుతున్నారా? ఆ పని మీరే చేసుకోవచ్చు.. ఎలాగంటే!