SBI Alert: మీరు SBI ఖాతాదారులా.. అయితే ఆ రెండు నంబర్ల నుంచి లింక్‌లు వస్తే అస్సలు క్లిక్ చెయ్యొద్దు..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ 44 కోట్ల మంది ఖాతాదారులను అప్రమత్తం చేసింది...
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ 44 కోట్ల మంది ఖాతాదారులను అప్రమత్తం చేసింది. రెండు నంబర్ల గురించి కస్టమర్లను హెచ్చరించింది. మెసేజింగ్(Messaging), ఇమెయిల్(Email), ఫిషింగ్ వంటి వివిధ కమ్యూనికేషన్ మార్గాల ద్వారా మోసాల జరుగుతున్నట్లు బ్యాంకు ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఈ విషయాన్ని బ్యాంక్ ట్వీట్ ద్వారా తెలిపింది. దీనితో పాటు, బ్యాంక్ మోసాలను ఎలా నివారించాలో కూడా వివరించింది. సైబర్ నేరాల గురించి చెప్పడానికి హెల్ప్‌లైన్ నంబర్ 1930ని సంప్రదించాలని బ్యాంక్ కోరింది. 8294710946, 7362951973 నుంచి KYC అప్‌డేట్ కోసం SBI కస్టమర్‌లను ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయమని కోరుతున్నట్లు ట్వీట్‌లో పేర్కొంది. ఇలాంటి అనుమానాస్పద లేదా ఫిషింగ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఖాతాదారులను హెచ్చరించింది.
ఖాతాదారుల భద్రతే తమ ప్రాధాన్యత అని బ్యాంక్ ట్వీట్‌లో పేర్కొంది. మోసాన్ని నివారించడానికి పలు చిట్కాలను సూచించింది. టెలికాలర్, ఇమెయిల్, SMS ద్వారా అందుకున్న KYC అప్‌డేట్‌ల సందేహాస్పద ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. పాస్‌వర్డ్‌ను రహస్యంగా ఉంచుకోవాలని.. దానిని మార్చుకుంటూ ఉండాలని సూచించింది. వ్యక్తిగత లేదా ఖాతా సంబంధిత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని బ్యాంక్ తెలిపింది. సులభంగా ఊహించలేని పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని కోరింది. మీ ATM కార్డ్ నంబర్, PIN, UPI PIN, INB వివరాలను ఎక్కడా రాసుకోవద్దని తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తమ ఖాతాదారులు మోసాల బారిన పడకుండా అనేక చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసింది, దీనిలో అన్ని రకాల మోసాల గురించి, దానిని ఎలా నివారించాలి అనే దాని గురించి వివరించారు. మోసగాళ్లు బ్యాంక్, ఈ-కామర్స్, సెర్చ్ ఇంజిన్ లాగా కనిపించే ఫిషింగ్ వెబ్‌సైట్‌ను సృష్టిస్తారు. దీని తర్వాత మోసగాళ్లు ఈ లింక్‌ని SMS, సోషల్ మీడియా, ఇమెయిల్ లేదా ఇన్‌స్టంట్ మెసెంజర్, ఇతర మార్గాల ద్వారా ఖాతాదారులకు పంపి మోసానికి పాల్పడతారని ఎస్‌బీఐ తెలిపింది.
आपकी सुरक्षा हमारी प्राथमिकता है। धोखाधड़ी से बचने के लिए इन सुझावों का पालन करें। #SafeWithSBI #CyberSafety #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/d5GfO8tI8c
— State Bank of India (@TheOfficialSBI) April 20, 2022