Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. గరిష్ఠ స్థాయికి చేరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు..
దాదాపు అన్ని సెక్టార్లలో లాభాల కారణంగా స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వరుసగా మూడవ రోజు కూడా పెరిగి రూ. 2,782.15 వద్ద స్థిరపడింది...
దాదాపు అన్ని సెక్టార్లలో లాభాల కారణంగా స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వరుసగా మూడవ రోజు కూడా పెరిగి రూ. 2,782.15 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే డీల్స్‌లో ఈ స్టాక్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ. 2,788.80ని తాకింది. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్(సెన్సెక్స్) 874 పాయింట్లు పెరిగి 57,912 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty) 256 పాయింట్లు పెరిగి 17,393 వద్ద ముగిసింది.నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.07 శాతం, స్మాల్ క్యాప్ 1.55 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 2.23, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.54 శాతం పెరిగాయి.
ఐచర్ మోటార్స్ నిఫ్టీలో టాప్ గెయినర్‌గా ఉంది. ఈ స్టాక్ 4.36 శాతం పెరిగి రూ. 2,647.35కి చేరుకుంది. కోల్ ఇండియా, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా లాభపడ్డాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, మారుతీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ లాభాల్లో ముగిశాయి. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వరుసగా రెండో సెషన్‌లో లాభపడ్డాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.45 శాతం పెరిగి 1,374.25 వద్ద ముగియగా, హెచ్‌డిఎఫ్‌సి 2.25 శాతం పెరిగి రూ. 2,230.75 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, టాటా స్టీల్ నష్టాల్లో స్థిరపడ్డాయి.