Vishnu Manchu- Sunny Leone: మంచు విష్ణు ఇంట్లో సన్నీలియోన్ సందడి.. వంటలక్కగా మారిన హాట్ బ్యూటీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. హిందీలో ఈ అమ్మడు జిస్మ్ 2 సినిమాతో పరిచయం అయ్యింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్(Sunny Leone)తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. హిందీలో ఈ అమ్మడు జిస్మ్ 2 సినిమాతో పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా అలరించిన సన్నీ తెలుగులో.. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఓ చిన్న రోల్ లో మెరిసింది అందాల సన్నీ. ఆతర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగా సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఆతర్వాత ఈ చిన్నది పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి మళ్ళీ పులుపు అందలేదు. దాంతో బాలీవుడ్ కే పరిమితం అయ్యింది సన్నీ ఇక ఇప్పుడు ఈ చిన్నది తిరిగి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. మంచు విష్ణు(Vishnu Manchu) నటిస్తున్న సినిమాలో సన్నీలియోన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది సన్నీ.
మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాలి నాగేశ్వరరావు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . ఈ మూవీలో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో సన్నీ నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీతో బాగా కలిసి పోయింది సన్నీ. మొన్నామధ్య మోహన్ బాబు ఈ అమ్మడిని తన శ్రీ విద్యానికేతన్ కు తీసుకువెళ్లి అక్కడి స్టూడెంట్స్ కి పరిచయం చేశారు. అలాగే మంచు విష్ణు కూడా ఈ అమ్మడితో ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా సన్నీలియోన్ వంటల కార్యక్రమాన్నినిర్వహించారు. సన్నీతో పరోటా చేయించాడు విష్ణు. ఈ వీడియోలో విష్ణు సన్నీకి రెండు కోడిగుడ్లు ఇచ్చి సమ్ థింగ్ కొత్తగా ట్రై చేయమని అంటాడు. సన్నిలియోన్ ఎలా చేయాలని సలహాలు అడగడం.. వాటికి విష్ణు సమాధానాలు ఇవ్వడం చాలా ఫన్నీగా అనిపించింది. సినీ పల్లైటూరి ఆడపిల్లలా కనిపించింది ఈ వీడియోలో. అలాగే వచ్చి రాని తెలుగులో సన్నీ ‘దీనెక్క పరోటో అదిరిపోయింది’ అంటూ డైలాగ్ చెప్పింది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :