Samantha: ‘థాంక్యూ మై క్యూటీ.. ‘ సమంతపై నయన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. సామ్ రియాక్షన్ ఏంటంటే..
అంతకు ముందు విడుదలైన పఠాన్ రికార్డ్స్ సైతం బద్దలుకొట్టి దాదాపు రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో నయన్ కు అటు హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అటు సినిమాలతో.. ఇటు వ్యాపారరంగంలోనూ రాణిస్తోంది. కొద్ది రోజులుగా నయన్ తన కొత్త చర్మ సంరక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో బిజీగా ఉంది. ఇటీవలే 'నయన్ స్కిన్' పేరుతో కాస్మోటిక్స్ విడుదల చేసింది. నయనతార, విఘ్నేష్ కూడా నయన్ స్కిన్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉంది సౌత్ బ్యూటీ నయనతార. ఇటీవలే జవాన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది లేడీ సూపర్ స్టార్. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ సరసన నయన్ నటించిన ఈ తొలి సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అంతకు ముందు విడుదలైన పఠాన్ రికార్డ్స్ సైతం బద్దలుకొట్టి దాదాపు రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో నయన్ కు అటు హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అటు సినిమాలతో.. ఇటు వ్యాపారరంగంలోనూ రాణిస్తోంది. కొద్ది రోజులుగా నయన్ తన కొత్త చర్మ సంరక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో బిజీగా ఉంది. ఇటీవలే ‘నయన్ స్కిన్’ పేరుతో కాస్మోటిక్స్ విడుదల చేసింది. నయనతార, విఘ్నేష్ కూడా నయన్ స్కిన్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. వీటిని 9SKIN పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇక ఈ కాస్మోటిక్స్ ప్రచారకర్తగా నయన్ వ్యవహరిస్తున్నారు. ఈ చర్మ ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్, పోస్టర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంది నయన్.
ఇదిలా ఉంటే.. నయన్ స్కిన్ ఉత్పత్తులను తన స్నేహితురాలు సమంతకు కానుకగా పంపించింది. వీటిని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. “ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని ప్రయత్నించడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్” అంటూ రాసుకొచ్చింది. ఇక సామ్ స్టోరీకి రిప్లై ఇచ్చింది నయన్. సామ్ ఇన్ స్టా స్టోరీని షేర్ చేస్తూ.. థాంక్యూ మై క్యూటీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది నయన్. ప్రస్తుతం వీరిద్దరి ఇన్ స్టా ముచ్చట నెట్టింట వైరలవుతుంది.

Samantha, Nayanthara
నయనతార, సమంత ఇద్దరు కలిసి కాతువాకుల రెండు కాదల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఈమూవీ షూటింగ్ సమయంలో సమంతకు చెవి పోగులను బహమతిగా అందించింది నయన్.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సామ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకోవడానికి ఆమె అమెరికా వెళ్లింది. గత రెండు రోజులుగా ఇమ్యూనిటీ పవర్ గురించి మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది సామ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








