Nayanthara: రూ.100 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో అస్సలు నటించను.. నయనతార షాకింగ్ కామెంట్స్..
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు అచి తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటుంది. జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. అత్యధిక పారితోషికం తీసుకునే సినీతారలలో ఆమె ఒకరు. నయనతార.. సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన అమ్మడు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది. ఇదిలా ఉంటే.. నయనతార రూ.100 కోట్లు ఇచ్చిన ఓ హీరోతో నటించననని ముఖం మీదే చెప్పేసిందట. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ బ్యూటీ, ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత నయనతారకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ యష్ తో కలిసి టాక్సిక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్, వివరాలను చాలా గోప్యంగా ఉంచారు.
ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి నటిస్తున్నారని సమాచారం. మలయాళ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార పాత్ర చాలా ముఖ్యమైనదని తెలుస్తోంది. జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నయన్.. ఈ మూవీ తర్వాత తన పారితోషికం మరింత పెంచిందని టాక్. అయితే ఓ హీరోతో మాత్రం రూ.100 కోట్లు నటించనని చెప్పేసిందట. అతడు మరెవరో కాదు.. శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. 2022లో విడుదలైన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. అయిత తన సినిమాలో నయనతారను కథానాయికగా తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడట. కానీ నయన్ అందుకు ఒప్పుకోలేదు.
నయనతారకు బదులుగా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా శరవణన్ సరసన హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే, అలియా భట్ అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్నారు. కానీ రూ.100 కోట్లు ఇచ్చినా అతడి పక్కన నటించనని నయన్ చెప్పినట్లు వార్తలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు నయన్ స్పందించలేదు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..




