Saripodhaa Sanivaaram: ఓటీటీలో దుమ్మురేపుతోన్న నాని సినిమా.. సరిపోదా శనివారం నయా రికార్డ్..
అంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కథ తొందరగా కనెక్ట్ అవ్వకపోవడమతో సినిమా నిరాశపరిచింది. ఆతర్వాత ఇప్పుడు స్టైల్ మార్చి యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు వివేక్.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకతవరంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కథ తొందరగా కనెక్ట్ అవ్వకపోవడమతో సినిమా నిరాశపరిచింది. ఆతర్వాత ఇప్పుడు స్టైల్ మార్చి యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు వివేక్. ఇక సరిపోదా శనివారం సినిమాలో నానిమరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.
ఇది కూడా చదవండి : Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?
అలాగే ఈ సినిమాలో దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య తన నటనతో ఆకట్టుకున్నాడు. నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించి మెప్పించారు సూర్య. ఇక ఈ సినిమా థియేటర్స్‌లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది సరిపోదా శనివారం సినిమా. థియేటర్స్ లో సినిమాను మిస్ అయినా ఆడియన్స్ అలాగే థియేటర్స్ చూసిన ఆడియన్స్ కూడా ఓటీటీలో ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి :Nani’s Gang Leader: హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..! మరీ ఇంత మార్పా..!!
దాంతో సరిపోదా శనివారం సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంటూ నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో సినిమా ట్రెండ్ అవుతుంది. దీనితో ఓటిటిలో కూడా ఈ చిత్రం అదరగొడుతుందనే చెప్పాలి. ఇక సరిపోదా శనివారం సినిమా నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమా.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడేం చేస్తుందంటే
♥️#SaripodhaaSanivaaram @netflix pic.twitter.com/hRmaqULHpI
— Nani (@NameisNani) September 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.