Mithun Chakraborty: సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
మిథున్ చక్రవర్తి ఈ పురస్కారానికి ఎంపికైనట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. అలాగే సినిమా రంగానికి మిథున్ సేవలను కేంద్ర మంత్రి కొనియాడారు. మిథున్ చక్రవర్తి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందారు మిథున్ చక్రవర్తి.
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి అరుదైన గౌరవం దక్కింది. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 70వ జాతీయ సినిమా పురస్కారాల సందర్భంగా.. అక్టోబర్ 8న మిథున్ చక్రవర్తికి అవార్డు ప్రదానం చేయనున్నారు. మిథున్ చక్రవర్తి ఈ పురస్కారానికి ఎంపికైనట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. అలాగే సినిమా రంగానికి మిథున్ సేవలను కేంద్ర మంత్రి కొనియాడారు. మిథున్ చక్రవర్తి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందారు మిథున్ చక్రవర్తి. అంతే కాదు పలు పురస్కారాలు కూడా అందుకున్నారు. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు.
ఇది కూడా చదవండి : Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?
ఇప్పటివరకు మిథున్ 24వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 1976 ఉత్తమ నటుడు – మృగయా, 40వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడు – తహదేర్ కథ, అలాగే 43వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటుడిగా స్వామి వివేకానంద సినిమాలకు అవార్డులు అందుకున్నారు.
ఇది కూడా చదవండి :Nani’s Gang Leader: హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..! మరీ ఇంత మార్పా..!!
మిథున్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించారు. ‘ముక్తి’, ‘బన్సారీ’, ‘అమర్‌దీప్’, ‘ప్రేమ్ వివాహ్’, ‘భయానక్’, ‘కస్తూరి’, ‘కిస్మత్’, ‘మే ఔర్ మేరా సాథి’, ‘సాహాస్’, ‘వాంటెడ్’, ‘బాక్సర్’, ‘త్రినేత్ర’, ‘దుష్మన్’, ‘దలాల్’, ‘భీష్మ’, ‘సుల్తాన్’, ‘గురు’, ‘కిక్’, ‘బాస్’, డిస్కోడాన్సర్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు మిథున్ చక్రవర్తి. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడేం చేస్తుందంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.