పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడేం చేస్తుందంటే

ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది ఈ మూవీ. ముఖ్యంగా ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్ ఉంటుంది. యమా స్టైల్ గ ఉంటారు పవన్. గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించి అభిమానులకు కిక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 2011 లో విడుదలైన ఈ సినిమాకు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు.

పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడేం చేస్తుందంటే
Panja Movie
Follow us

|

Updated on: Sep 29, 2024 | 9:32 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ప్రేక్షకల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పూనకాలే.. ఇక పవన్ సినిమాల్లో ప్రేక్షకులను ముఖ్యంగా అభిమానులను ఆకట్టుకున్న సినిమా పంజా. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది ఈ మూవీ. ముఖ్యంగా ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్ ఉంటుంది. యమా స్టైల్ గ ఉంటారు పవన్. గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించి అభిమానులకు కిక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 2011 లో విడుదలైన ఈ సినిమాకు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. జాకీ ష్రాఫ్ , అడివి శేష్ అలాగే అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన సారా-జేన్ డయాస్ హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అంజలి లావానియా నటించింది.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

అంజలి ఈ మూవీలో చాలా హాట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. పంజా సినిమాలో గ్లామరస్ పాత్రలో కనిపించిన అంజలి. ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది.? ఈ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది. 2012లో ఆమె వోగ్ టాప్ 10 మోడల్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

అలాగే చాలా అందాల పోటీల్లోనూ పాల్గొంది. అంజలి లావానియా చక్ర హీలింగ్ లోని క్రియా యోగా యొక్క వైద్యం చేసే కళలను నేర్చుకోవడానికి మోడలింగ్ అలాగే నటనకు కొన్ని సంవత్సరాల విరామం తీసుకుంది. ఇప్పుడు నటనకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. కానీ డీజే గా మారి ప్రేక్షకులను అలరిస్తుంది అంజలి. సోషల్ మీడియాలో అంజలి లావానియా కు సంబందించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.