Akhanda: నటసింహం గర్జనతో షేక్ అవుతున్న యూట్యూబ్.. ట్రెండింగ్‌లో “అఖండ” సాంగ్ ప్రోమో
నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని అఖండ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి , బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Nandamuri Balakrishna: నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని అఖండ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సింహ, లెజెండ్‌లతో నట సింహం బాలయ్య కెరీర్‌లో మైల్ స్టోన్స్‌లాంటి సినిమాలను అందించిన బోయపాటి. ఇప్పుడు అఖండగా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పవర్ ఫుల్ స్టోరీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు బోయపాటి. ఈ సినిమాలో డ్యూయల్ రోలో బాలయ్య గర్జించనున్నారు. నందమూరి అభిమానుల పల్స్ తెలిసిన బోయపాటి ఈ సినిమాలో బాలయ్యను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తపాత్రలో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా అఖండ టైటిల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
భమ్ భమ్ అఖండ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ ప్రోమో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇప్పటికే 24 గంటలు దాటకుండానే ఈ ప్రోమో 2 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకొని టెండింగ్‌లో కొనసాగుతుంది. పూర్తి లిరికల్ వీడియోను 8తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు.
2️⃣ Million+ Roars & Trending on @YouTubeIndia for#AkhandaTitleSong Teaser ??
ICYMI ▶️ https://t.co/RE8NyjwY3W
Full Lyrical Video on 8th Nov!#Akhanda #BB3#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @LahariMusic pic.twitter.com/nYfYtxYW9P
— BA Raju’s Team (@baraju_SuperHit) November 4, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :