Agent Movie : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ ఇచ్చిన జోష్.. శరవేగంగా “ఏజెంట్” ను పూర్తి చేస్తున్న అఖిల్..

కుర్ర హీరో అఖిల్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఎప్పటినుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ సినిమాతో హిట్ ఇచ్చారు బొమ్మరిల్లు భాస్కర్.

Agent Movie : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ ఇచ్చిన జోష్.. శరవేగంగా ఏజెంట్ ను పూర్తి చేస్తున్న అఖిల్..
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2021 | 9:47 AM

Akhil Akkineni : కుర్ర హీరో అఖిల్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఎప్పటినుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ సినిమాతో హిట్ ఇచ్చారు బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్, పూజాహెగ్డే హీరో హీరోయిన్స్‌‌‌గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందమైన ప్రేమ కథతో పాటు చక్కటి ఎమోషన్స్ తో సాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మొదటి హిట్‌ను అందుకున్నాడు అఖిల్. ఇప్పుడు ఇదే జోష్‌తో తన నెక్స్ట్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన తదుపరి సినిమా చేస్తున్నడు. స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ఏజెంట్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గత కొంతకాలంగా యూనిట్ ప్రస్తుతం హంగేరిలో షూట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. మమ్ముట్టి పై  బుడాపెస్ట్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఇప్పుడు కొచ్చి లో షూట్ ను స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. ఈ షూట్‌లో అఖిల్ విదేశీ స్టంట్ మెన్‌లతో ఫైట్స్ చేయన్నాడు ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి వైద్య  నటిస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mehreen Pirzada Birthday: మంచులో కడిగిన ముత్యంలాంటి ముద్దుగుమ్మ మెహ్రీన్..

Allu Arjun’s Pushpa : సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా.. ‘పుష్ప’ సినిమాలో ఏకంగా వేయిమంది..

Dil Raju: రామ్ చరణ్- శంకర్ సినిమాకోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!!