Pawan-Mahesh: ధమాకా న్యూస్… దీపావళి సందర్భంగా మహేశ్ ఫ్యామిలీకి గిఫ్ట్ పంపిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్యాన్ బేస్, మార్కెట్ ఉన్న హీరోలు. హిట్ కొడితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టడం వీరి స్పెషాలిటీ.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్యాన్ బేస్, మార్కెట్ ఉన్న హీరోలు. హిట్ కొడితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టడం వీరి స్పెషాలిటీ. సూపర్ హిట్ కొట్టారంటే.. ఆ సౌండ్ మాములుగా ఉండదు. కాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. అసలు అలాంటి కాంబినేషన్ కుదిరితే.. రికార్డులు తుప్పు వదలాల్సిందే. ఇక పవన్ గురించి… మహేశ్ ప్రస్తావించినా, మహేశ్ గురించి పవన్ మాట్లాడినా అభిమానులు తెగ సంబరపడిపోతారు. తాజాగా దీపావళి సందర్భంగా ఈ హీరోల అభిమానులకు ఓ ధమాకా న్యూస్ వచ్చేసింది.
దీపావళి పండగ సందర్భంగా.. శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు సినీ ప్రముఖులకు కానుకలు పంపారు పవన్ కల్యాణ్. అలాగే సూపర్ స్టార్ మహేశ్ కుటుంబానికి ఈ గిఫ్ట్ అందించారు. ఇందులో పర్యావరణానికి హాని చేయని గ్రీన్ క్రాకర్స్ తో పాటు స్వీట్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కానుకలు పంపినందుకు పవన్‌కు థ్యాంక్స్ చెప్పారు. టాలీవుడ్ ఇరువురు అగ్రహీరోల మధ్య ఈ బాండింగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ, మరోవైపు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటున్నారు పవన్ . ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక మహేశ్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ముగించే పనిలో ఉన్నారు.
Also Read: Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో గుడ్ బై