Nagarjuna Akkineni: ”దానికి రాజమౌళి సమాధానం అది ఒక్కటే”.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్న హీరోల్లో మన్మధుడు నాగార్జున ఒకరు. అదే అందం, అదే ఫిట్ నెస్ తో యంగ్ హీరోలకు గట్టిపోటీనే ఇస్తున్నారు నాగార్జున

Nagarjuna Akkineni: ''దానికి రాజమౌళి సమాధానం అది ఒక్కటే''.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2022 | 9:46 AM

ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్న హీరోల్లో మన్మధుడు నాగార్జున(Nagarjuna Akkineni) ఒకరు. అదే అందం, అదే ఫిట్ నెస్ తో యంగ్ హీరోలకు గట్టిపోటీనే ఇస్తున్నారు నాగార్జున. ఇటీవలే బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగార్జున. ఇటు సినిమాలతో పటు బిగ్ బాస్ గేమ్ షోను కూడా మానేజ్ చేస్తున్నారు నాగ్. అలాగే ఇటీవల బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటించారు నాగ్. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ గా నిలిచింది. అలాగే ఇప్పుడు ఘోస్ట్ అనే సినిమా చేస్తున్నారు నాగార్జున. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగార్జున. ఈ సందర్భంగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తానని మనసులో మాట బయట పెట్టారు నాగ్. . రాజమౌళి దర్శకత్వంలో ఫుల్సి నిమా చేయాలని ఉందన్నారు. దాని గురించి రాజమౌళిని తాను తరచూ అడుగుతూనే ఉన్నానని కానీ, ప్రతిసారి చిరునవ్వే రాజమౌళి సమాధానం అవుతోందన్నారు.  కథ సిద్ధమయ్యాకే దానికి తగ్గ నటులను వెతుకుతారన్నారు.. అలాంటి సమయం వచ్చినప్పుడే మేమిద్దరం కలిసి సినిమా చేస్తాం అన్నారు నాగార్జున.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..