Naga Chaitanya: పెళ్లి, పిల్లలపై నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్.. రానాతో ఏం చెప్పారంటే..

అక్కినేని హీరో నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కొన్ని నెలలుగా తండేల్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న చైతూ.. తాజాగా రానా హోస్టింగ్ చేస్తున్న ఓ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రానా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అలాగే పెళ్లి, పిల్లల గురించి పలు విషయాలను పంచుకున్నాడు చైతూ.

Naga Chaitanya: పెళ్లి, పిల్లలపై నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్.. రానాతో ఏం చెప్పారంటే..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2024 | 10:09 AM

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల్లో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇదివరకే వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా.. డిసెంబర్ 4న వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని కథనాలొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు చైతూ, శోభితా పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇదివరకే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని కొన్ని ఫోటోస్ షేర్ చేసింది శోభిత.

విశాఖపట్నంలో తన వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయంటూ శోభిత ఫోటోస్ షేర్ చేయడంతో వీరి పెళ్లి పై మరోసారి చర్చ మొదలైంది. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో చైతూ, శోభిత పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయంటూ ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా రానా హోస్టింగ్ చేస్తోన్న ఓ షోలో పాల్గొన్నాడు చైతూ. ఈ క్రమంలో పెళ్లి, పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇవి కూడా చదవండి

హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ఖాతాలో కొత్త చాట్ షో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. అందులో పలువురు స్టార్ నటీనటులు పాల్గొన్నారు. అలాగే నాగచైతన్య కూడా సందడి చేశాడు. మీ కుటుంబం ఎలా ఉండాలని ఊహిస్తారు ? అని రానా అడగ్గా.. చైతూ మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకోవడం సంతోషం. పిల్లలతో దంపతులు. ‘ అని షార్ట్ అండ్ స్వీట్ గా ఆన్సర్ ఇచ్చాడు చైతూ. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుంది. అటు సిటాడెల్ ప్రమోషన్లలోనూ సామ్ తనకు పిల్లల గురించి రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!