Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Rohit: తండ్రి మృతిపై నారా రోహిత్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏమన్నారంటే..

నారా రోహిత్‌ తన తండ్రి మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఎన్నో త్యాగాలు చేశారంటూ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ చేశారు. జీవితంలో తనకు ఎన్నో విషయాలను తండ్రి నేర్పించారని ఎమోషన్‌ అయ్యారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి తండ్రే కారణం అంటూ రాసుకొచ్చారు...

Nara Rohit: తండ్రి మృతిపై నారా రోహిత్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏమన్నారంటే..
Nara Rohit
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 17, 2024 | 10:19 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు, సినీనటుడు నారా రోహిత్‌ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణించారన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్ సమస్యలతో బాధపడుతోన్న ఆయన శనివారం హైదరాబాద్‌లోఏ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 14వ తేదీన ఆరోగ్యం విషమించడంతో రామ్మూర్తి నాయుడిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన గుండె వైఫల్యం చెందడంతో మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే రామ్మూర్తి నాయుడి మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కాగా తాజాగా తండ్రి మరణంపై నారా రోహిత్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తండ్రితో చిన్నతనంలో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ఒక నోట్‌ రాసుకొచ్చారు. ‘మీరొక ఫైటర్‌ నాన్న. మీరు నాకు ప్రేమించడాన్ని నేర్పించారు. జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మీరే కారణం. మంచి కోసం పోరాడాలని నేర్పించారు’ అని రాసుకొచ్చారు.

అలాగే.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారని.. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారన్నారు. తండ్రితో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయంటూ రాసుకొచ్చారు. ఇక చివరిగా ఏం చెప్పాలో తోచడం లేదంటూ బై నాన్నా అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నారా రోహిత్ ట్వీట్..

తండ్రి మరణంతో నారా రోహిత్‌ ఎంతటి ఎమోషన్‌కు గురైయ్యాడో ఈ పోస్ట్‌ చెబుతోందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్మూర్తి నాయుడి పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. స్వస్థలం నారావారిపల్లెలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..