Pushpa 2: ఇదెక్కడి క్రేజ్ మామ.. పుష్పరాజ్ మేనియాతో ఊగిపోతున్న నార్త్.. బందుక్‏తో స్వాగతం.!

అయ్య బాబోయ్.. ఇదెక్కడి క్రేజ్ మామ.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ మాటే వినిపిస్తుంది. సోషల్ మీడియా పుష్ప 2 ట్రెండింగ్‏లో దూసుకుపోతుంది. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.

Pushpa 2: ఇదెక్కడి క్రేజ్ మామ.. పుష్పరాజ్ మేనియాతో ఊగిపోతున్న నార్త్.. బందుక్‏తో స్వాగతం.!
బీహార్‌లో ఈవెంట్‌ను ఏర్పాటు చేయటం వెనుక రీజనేంటో కూడా రివీల్ చేశారు..అల్లు అర్జున్‌. పుష్ప ఫస్ట్ పార్ట్‌ను కోవిడ్‌ కష్టాల్లోనూ బిహార్ ఆడియన్స్‌ ఎంతగానో ఆదరించారు. అందుకే ఆ కృతజ్ఞతతోనే పుష్ప-2 తొలి ఈవెంట్‌ను పాట్నాలో ఏర్పాటు చేశామన్నారు. గాంధీ మైదానంలో జాతర సెట్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌..ఇండియన్ సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. బిహార్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద మూవీ ఈవెంట్‌. 900 మంది పోలీసులతో పాటు 300 మంది ప్రైవేట్‌ సెక్యూరిటీతో బిహార్‌ కార్యక్రమానికి భద్రత కల్పించింది..బిహార్‌ ప్రభుత్వం. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు..బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్‌ సిన్హా .
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2024 | 9:03 AM

పుష్ప 2.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పుష్ప 2 ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అయితే ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఈరోజు సాయంత్రం అడియన్స్ ముందుకు రానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను పాట్నాలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఈరోజు (నవంబర్ 17న) సాయంత్రం 5 గంటలకు పాట్నాలోని గాంధీ మైదాన్ లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుక కోసం భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కానున్నారు. ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాసుల కోసం క్యూ కట్టారు ఫ్యాన్స్. మరోవైపు పుష్ప మేనియాతో ఊగిపోతుంది బిహార్. ఎక్కడ చూసిన పుష్ప 2 హోర్టింగ్స్ కనిపిస్తున్నాయి. రోడ్డు పొడవునా పుష్పరాజ్ పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకకు భారీ సంఖ్యలో రానుండడంతో ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే పుష్ప 2 గురించి ఓ బిహార్ అభిమాని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో సదరు యువకుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకు తుపాకీ గుండ్లు పేల్చి పుష్పకు స్వాగతం చెబుతామని అన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. దీంతో బిహార్ లో పుష్ప2కు ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం అర్థమవుతుంది. ఈసారి పుష్ప 2 నార్త్ ఇండియాలో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయంగా తెలుస్తోంది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.