Mrunal Thakur: కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు కుమ్మేసిన మృణాల్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

సీతారామం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి భామ. తొలి సినిమాతోనే ఈ బ్యూటీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది మృణాల్. అందం అభినయంతో ఈ చిన్నది తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది.

Mrunal Thakur: కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు కుమ్మేసిన మృణాల్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
Mrunal Thakur
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2024 | 2:51 PM

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన చాలా మంది ముద్దుగుమ్మలు ప్రేక్షకులను మెప్పిస్తూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి భామ. తొలి సినిమాతోనే ఈ బ్యూటీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది మృణాల్. అందం అభినయంతో ఈ చిన్నది తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. నా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా మృణాల్ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఈ అమ్మడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది మృణాల్.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమాలో థమన్ సంగీతం అందించిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎక్కడ చూసిన ఈసాంగే వినిపిస్తుంది. సినిమా వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటికీ ఈ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఓ ఈవెంట్ లో ఈ పాటకు మృణాల్ స్టెప్పులేసింది. రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ ఓ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యింది. ఆ ఈవెంట్ లో స్టేజ్ పై మృణాల్ ‘కుర్చీ మడతపెట్టి ఇదిగో ఇలా స్టెప్పులేసి మెప్పించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ అన్నతో సినిమా చేయండి అంటూ మృణాల్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ క్రేజ్ మాత్రం పీక్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.