Miss Shetty Mr Polishetty Teaser: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ వచ్చేసింది.. అనుష్కతో కామెడీ చేసేందుకు రెడీ అయిన పోలిశెట్టి..

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా కాసేపటి క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుష్క చెఫ్ గా కనిపిస్తుంటే.. నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. టీజర్ చూస్తుంటే ఈసారి మరింత ఎక్కువే నవ్వించేందుకు సిద్దమయినట్లుగా తెలుస్తోంది.

Miss Shetty Mr Polishetty Teaser: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. అనుష్కతో కామెడీ చేసేందుకు రెడీ అయిన పోలిశెట్టి..
Miss Shetty Mr Polishetty T
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: May 31, 2023 | 12:57 PM

జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ . ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కథానాయికగా నటిస్తుంది. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా కాసేపటి క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుష్క చెఫ్ గా కనిపిస్తుంటే.. నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. టీజర్ చూస్తుంటే ఈసారి మరింత ఎక్కువే నవ్వించేందుకు సిద్దమయినట్లుగా తెలుస్తోంది.

బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం మాత్రమే ఉంది.బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్దం చిత్రాల్లో నటించిన అనుష్క.. దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు.

ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా వస్తోన్న ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ