RGV-Keeravani: నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చే అర్హత ఉందనుకుంటున్నారా ?.. కీరవాణికి ఆర్జీవీ సూటీ ప్రశ్న..

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల నిజం అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సినీ ప్రముఖులు వర్మ స్వయంగా ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఛానల్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.

RGV-Keeravani: నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చే అర్హత ఉందనుకుంటున్నారా ?.. కీరవాణికి ఆర్జీవీ సూటీ ప్రశ్న..
Keeravani
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 29, 2023 | 3:37 PM

ప్రపంచ వేదికపై ట్రిపుల్ ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సినీప్రియులను తెగ నచ్చేసింది. ఇక ఇందులోని నాటు నాటు సాంగ్ సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఈ సాంగ్ ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఈ అవార్డును లాస్ ఏంజిల్స్ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. తాజాగా ఈ సాంగ్ పై కీరవాణి ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల నిజం అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సినీ ప్రముఖులు వర్మ స్వయంగా ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఛానల్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.

ఈ టాక్ షోలో ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని ఇంటర్వ్యూ చేసినట్లుగా తెలుస్తోంది. ఆస్కార్ వెనక నాటు నిజం అనే పేరుతో ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఆర్జీవీ తనదైన స్టైల్లో కీరవాణిని ప్రశ్నించారు. నాటు నాటు పాటకు మీరు కాకుండా ఇతరులు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసుంటే ఆస్కార్ పొందే అర్హత ఆ పాటకు ఉందని మీరు ఫీలయ్యేవారా ? అని ఆర్జీవీ ప్రశ్నించారు. దీనికి కీరవాణి స్పందిస్తూ.. ఆ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలున్నాయని.. కేవలం ఒక పాటగా తీసుకుంటే మాత్రం ఆస్కార్ వచ్చినందుకు నేను ఫీల్ అవ్వను.. ఎందుకంటే జయహో పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు ఫీలవలేదు కాబట్టి అని ఆన్సరిచ్చారు.

అలాగే నాటు నాటు సాంగ్ మీ కెరీర్ లో టాప్ 100 సాంగ్స్ లో ఉందని అనుకుంటున్నారా ? అని వర్మ ప్రశ్నించగా లేదని చెప్పారు కీరవాణి.. ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు అవతలి వాళ్లకు నచ్చాలని మనం పని చేస్తున్నప్పుడు ముందు అది మనకు నచ్చాలి.. నాకే నచ్చకపోతే ప్రపంచానికి ఎలా నచ్చుతుందని అనుకుంటాను ? కొన్నిసార్లు ముందు నాకు నచ్చాలని చుస్తాను.. మరికొన్నిసార్లు అవతలివాళ్లకు నచ్చాలని భావిస్తాను.. ఇది పరిస్థితులను బట్టి మారుతుంది అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.