Chakravarthy: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో కన్నుమూసిన ప్రముఖ నిర్మాత

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత ఎస్‌ ఎస్‌ చక్రవర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌ మహమ్మారితో బాధపడుతోన్న ఆయన శనివారం తెల్లవారుజాము తుదిశ్వాస విడిచారు.  చక్రవర్తి వయసు 53 సంవత్సరాలు కాగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Chakravarthy: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో కన్నుమూసిన ప్రముఖ నిర్మాత
Chakravarthy, Ajith
Follow us
Basha Shek

|

Updated on: Apr 29, 2023 | 3:51 PM

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత ఎస్‌ ఎస్‌ చక్రవర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌ మహమ్మారితో బాధపడుతోన్న ఆయన శనివారం తెల్లవారుజాము తుదిశ్వాస విడిచారు.  చక్రవర్తి వయసు 53 సంవత్సరాలు కాగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చక్రవర్తి మరణం తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులు చక్రవర్తి మరణంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా చక్రవర్తికి అభిరుచి గల నిర్మాతగా మంచి పేరుంది. ముఖ్యంగా స్టార్‌ హీరో అజిత్‌తో వరుసగా సినిమాలు చేశారాయన. 1997లో ‘రాశి’ అనే సినిమాతో ప్రొడ్యూసర్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు చక్రవర్తి. ఇందులో అజిత్‌, రంభ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత అజిత్‌తోనే వాలి, రెడ్‌, సిటిజెన్‌, ముగవరే, విలన్‌, అంజనేయ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించారు. విక్రమ్‌, శింబు వంటి స్టార్‌ హీరోలతోనూ కొన్ని సినిమాలను రూపొందించారు.

చక్రవర్తి చివరిగా శింబు, హన్సిక జంటగా నటించిన వాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. కాగా ఆయన కుమారుడు జానీ రేణిగుంట అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులోనూ ఇదే పేరుతో జానీ సినిమా విడుదలైంది. ఈ సినిమా తర్వాత తండ్రి నిర్మాణ దర్శకత్వంలోనే 18 వయసు అనే చిత్రంలోనూ నటించాడు జానీ. కాగా నిర్మాత చక్రవర్తి గతేడాది విలంగు అనే వెబ్‌ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటించాడు. తెలుగులో ఇది సంకెళ్లు పేరుతో విడుదలైంది. రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు