AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయింది గురూ..! మిరాయ్ ట్రైలర్ వచ్చేసింది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనేలా ఉందిగా..

యంగ్ హీరో తేజ సజ్జ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు తేజ. ఇక ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.

అదిరిపోయింది గురూ..! మిరాయ్ ట్రైలర్ వచ్చేసింది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనేలా ఉందిగా..
Mirai
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2025 | 1:33 PM

Share

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు కుర్ర హీరో తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు తేజ సజ్జ.. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు తేజ. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత సోలో హీరోగా జంబిరెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా మరోసారి ప్రశాంత్ వర్మతో కలిసి హనుమాన్ సినిమా చేశాడు తేజ. హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.

పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

పాన్ ఇండియా వైడ్ గా హనుమాన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు తేజ మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ మధ్య సినిమా టైటిల్ తో పాటు తేజ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానుందని అర్ధమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, రితిక నాయక్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

ట్రైలర్ అదిరిపోయిందని చెప్పాలి. విజువల్ ఫీస్ట్ గా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే సినిమాలో వీఎఫ్ఎక్స్ ఆకట్టుకోనున్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో సీనియర్ నటి శ్రియ కూడా నటిస్తున్నారు. విలన్ గా మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టనున్నాడు. గతంలో హనుమాన్ సినిమా తరహాలోనే ఈ సినిమా శ్రీరాముడు కాన్సెప్ట్ తో రానుంది. ట్రైలర్ చివరిలో శ్రీరాముడు హీరోకు సాయం చేసినట్టు చూపించారు. చూడబోతుంటే ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 12న సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.