ఉప్పెన భామకు ఇప్పటికైనా లక్ కలిసిస్తుందా.?

Rajeev 

09 May  2026

instagram

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది. 

ఆతర్వాత వరుసగా రెండు హిట్స్ అందుకుంది. ఉప్పెన తర్వాత, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ కొట్టింది. 

అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. వరుసగా ఆరు, ఏడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 

దాంతో తెలుగులో సినిమాలకు బ్రేక్ ఇచ్చి మలయాళం, తమిళ్ ఇండస్ట్రీ పై ఫోకస్ చేసింది. అక్కడ హిట్స్ అందుకుంది. 

తమిళ్, మలయాళంలో హిట్స్ అందుకున్నా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో తిరిగి తెలుగు వైపు చూస్తుంది. 

ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. 

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతిశెట్టి కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా కృతికి హిట్ ఇస్తుందేమో చూడాలి.