మరో క్రేజీ ఆఫర్ అందుకున్న మృణాల్.? ఆ సినిమాలో హీరోయిన్‌గా..
Rajeev
10 May 2026
instagram
బాలివుడ్ సుందరి మృణాల్ ఠాకూర్ రూటే సపరేటు.. అందరిలా కాకుండా ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది.
విభిన్నమైన కథలను, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది మృణాల్.
సీతారామం లాంటి లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చింది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.
ఆతర్వాత నాని హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించింది. వీటిలో ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయ్యింది.
దాంతో మృణాల్ చిన్న బ్రేక్ తీసుకుంది. ఆతర్వాత కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు మరో హిట్ అందుకుంది.
అడవి శేష్ నటించిన డెకాయిట్ సినిమాతో హిట్ అందుకుంది మృణాల్. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసిందని టాక్. దేవి శ్రీ ప్రసాద్ హీరోగా బలగం వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ గా చ
ేస్తుందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి