Megastar Chiranjeevi: అయితే ఏటంటావ్ ఇప్పుడు.. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా జీబ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తారంధ్ర యాసలో అదరగొట్టారు.

Megastar Chiranjeevi: అయితే ఏటంటావ్ ఇప్పుడు.. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2024 | 1:37 PM

టాలీవుడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న లేటేస్ట్ సినిమా జీబ్రా. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించారు. ఇందులో సత్య అక్కల, సత్యరాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించగా.. పద్మజ ఫిల్మ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స బ్యానర్స్ నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ వేదికగా జిబ్రా మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. 2024 హనుమాన్ మూవీతో శుభారంభం అయ్యిందని అన్నారు. అలాగే ఓ అభిమానిని సరదాగా ఆటపట్టిస్తూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంతో మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024 హనుమాన్ సినిమాతో శుభారంభం అయ్యింది. తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా మూవీ అయిపోయింది. చిన్న సినిమాలు కమిటీ కుర్రోళ్లు, టిల్లు స్క్వేర్, ఆయ్, మత్తు వదలరా 2 ఇలా వరుసగా హిట్స్ వచ్చాయి. మొన్న దీపావళీకి వచ్చిన అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాల్లో స్టార్స్ లేరు. పెద్ద డైరెక్టర్స్ లేరు. కోట్ల బడ్జెట్ లేదు. కానీ కంటెంట్ ఉందన్నారు.

సినిమా ఆడలేదంటే కంటెంట్ లేకపోవడమే కారణం అన్నారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్స్ అవుతున్నాయని చెప్పారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందిస్తే.. ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్నసినిమాలు ఆడాలన్నారు చిరంజీవి. పార్క్‌ హయత్‌లో జీబ్రా సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ఓ అభిమానితో సరదాగా ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.