Sai Pallavi: పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి.! ఆ సినిమా షూటింగ్ లో కష్టాలు..
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న అభిమానగణం గురించి చెప్పక్కర్లేదు. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. కంటెంట్, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెను అభిమానులు ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు.
ఇటీవలే అమరన్ సినిమాతో మరోసారి అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఇందులో ఇందు రెబికా వర్గీస్ పాత్రలో మరోసారి అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక తన సినిమా అప్డేట్స్‌ను పక్కకు పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి ఓ సినిమా షూటింగ్ లో తాను ఎదుర్కొన్న కష్టాలు, మానిసిక ఒత్తిడి గురించి బెబుతూ ఎమోషనల్ అయింది.
తనకు రాత్రిళ్లు షూట్ చేయడం ఇష్టం ఉండేది కాదని.. నిద్రలేకపోతే తాను త్వరగా అలసిపోతానని చెప్పింది సాయి పల్లవి. కానీ శ్యామ్ సింగరాయ్ సినిమాకు కంటిన్యూగా రాత్రిళ్లు షూటింగ్ జరగడం తనను ఇబ్బందికి గురిచేసిందని ఓపెన్ అయింది. దీంతో తనకు సరిగ్గా నిద్రపట్టేది కాదని.. అలాగే షెడ్యూల్స్ వల్ల మానసికంగానూ, శారీరకంగానూ చాలా అలసిపోయానని చెప్పింది. శ్యామ్ సింగరాయ్ సినిమా.. దాదాపు ముప్పై రోజులపాటు కంటిన్యూగా షూటింగ్ జరిగిందని.. పనిభారం, అలసటతో చాలా నీరసించి పోయానని సాయి పల్లవి చెప్పింది. అంతేకాదు షూటింగ్ సెట్ లో ఏడ్చేశానని ఎమోషనల్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

